Breaking News
  • విజయనగరం: కొత్తవలస మండలం అప్పనపాలెంలో రోడ్డుప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు, నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అమరావతి: రేపు టీడీఎల్పీ సమావేశం. మంగళగిరి టీడీపీ కార్యాయలంలో ఉ.10:30కి సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. మధ్యాహ్నం నుంచి ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం.
  • ఢిల్లీ: నిర్భయ కేసు. న్యాయవాది ఏపీ సింగ్‌కు బార్‌ కౌన్సిల్‌ నోటీసులు. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశం. న్యాయవాది ఏపీ సింగ్‌పై విచారణకు ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు. నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్న ఏపీ సింగ్.
  • నల్గొండ: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కులేదు-ఉత్తమ్‌. 40 లక్షల మంది ఎస్సీలకు కేబినెట్‌లో మంత్రి పదవి లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు షాక్‌ తప్పదు-ఉత్తమ్‌కుమార్‌.
  • ఓయూ అసిస్టెంట్‌ ప్రొ.కాశిం ఇంటిపై పోలీసుల దాడిని ఖండించిన సీపీఐ. కాశిం ఇంటిపై పోలీసుల దాడి అప్రజాస్వామికం-చాడ వెంకట్‌రెడ్డి. రాష్ట్రంలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. కాశిం ఇంట్లో సోదాలను వెంటనే నిలిపివేయాలి-చాడ వెంకట్‌రెడ్డి.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలను అదుపుచేస్తున్న 17 ఫైరింజన్లు

Fire accident, ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలను అదుపుచేస్తున్న 17 ఫైరింజన్లు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ వైపు అంతర్జాతీయ యోగా దినోత్సవాలు జరుపుతుండగా మరోవైపు కలింది కుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ ఫర్నిచర్ షాపులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేకుందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు మొత్తం 17 ఫైరింజన్లను రంగంలోకి దించారు. అటు భారీ అగ్నిప్రమాదం కారణంగా కలిండి కుంజ్ బొటానికల్ గార్డెన్ మధ్య తాత్కాలికంగా మెట్రో సర్వీసులను నిలిపివేశారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.