లాక్‌డౌన్‌ వేల.. ప్రత్యేక తరగతులు నిర్వహించిన స్కూల్‌

పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానాలో ఓ స్కూల్‌ ప్రిన్సిపల్‌ లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి స్పెషల్ క్లాసెస్ పెట్టారు. దీంతో పోలీసులు ఆ స్కూల్ ప్రిన్సిపల్‌పై ఐసీపీ సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు.

లాక్‌డౌన్‌ వేల.. ప్రత్యేక తరగతులు నిర్వహించిన స్కూల్‌
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 7:36 PM

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఇటీవల కొన్నింటికి సడలింపులనిచ్చింది. అయితే ప్రస్తుతం విద్యాసంవత్సర ప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ జూన్ నెలలోనే ప్రతిఏటా స్కూల్స్‌తో పాటు.. కాలేజీలు కూడా ఓపెన్ అయ్యేవి. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యా సంస్థల ప్రారంభంపై కేంద్రం ఓ నిర్ణయానికి రాలేదు. అయితే తొలి లాక్‌డౌన్‌ సమయంలోనే విద్యాసంస్థలపై నిషేధం విధించింది. అయినప్పటికీ పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానాలో ఓ స్కూల్‌ ప్రిన్సిపల్‌ మాత్రం లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి స్పెషల్ క్లాసెస్ పెట్టారు. దీంతో పోలీసులు ఆ స్కూల్ ప్రిన్సిపల్‌పై ఐసీపీ సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ సెక్షన్‌ 51 కింద కూడా కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని లుథియానా వెస్ట్ ఏసీపీ సమీర్ వర్మ తెలిపారు. నగరంలోని హైబోవల్ ప్రాంతంలోని పాఠశాలలో విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంతో.. స్కూల్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశామని తెలిపారు.