అద్దె ఇంట్లో ఉంటూ.. మతబోధనలు చేస్తున్న బంగ్లా తబ్లీఘీలపై కేసులు నమోదు..

వీసా నిబంధనలను ఉల్లంఘింస్తూ మతపరమైన ప్రార్ధనలకు హాజరైన బంగ్లాదేశీయులపై బీహర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని సమస్తిపూర్‌లో ట్రావెల్‌ వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై.. తొమ్మిది మంది బంగ్లాదేశీయులపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన తొమ్మిది మంది గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్ నిర్వహించిన మతపరమైన సమావేశాలకు హాజరయ్యారని.. అక్కడి నుంచి బీహర్‌ సమస్తిపూర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని.. మతపరమైన బోధనలు […]

అద్దె ఇంట్లో ఉంటూ.. మతబోధనలు చేస్తున్న బంగ్లా తబ్లీఘీలపై కేసులు నమోదు..
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2020 | 8:17 PM

వీసా నిబంధనలను ఉల్లంఘింస్తూ మతపరమైన ప్రార్ధనలకు హాజరైన బంగ్లాదేశీయులపై బీహర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని సమస్తిపూర్‌లో ట్రావెల్‌ వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై.. తొమ్మిది మంది బంగ్లాదేశీయులపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన తొమ్మిది మంది గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్ నిర్వహించిన మతపరమైన సమావేశాలకు హాజరయ్యారని.. అక్కడి నుంచి బీహర్‌ సమస్తిపూర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని.. మతపరమైన బోధనలు చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు.. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘింస్తూ.. రోడ్లపై తిరుగుతూ.. కరోనా వ్యాప్తికి కారకులుగా మారారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. వీరికి రూంను అద్దెకు ఇచ్చిన ఇంటి యజమానిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

పట్టుబడ్డ వారి వివరాలను సమస్తిపూర్‌ ఎస్‌హెచ్ఓ సైఫుల్లా అన్సారీ తెలిపారు. ట్రావెల్ వీసా నిబంధనలను ఉల్లంఘించిన తొమ్మిది మంది బంగ్లాదేశీయుల పేర్లు.. మహమ్మద్ మిజనూర్ రహమాన్, అబ్దుల్ బారి, మహమ్మద్ రిహనుల్ ఇస్లామ్, ఎందదదుల్ హక్, మహమ్మద్ మహఫుజుర్ రహమాన్ అకండ, మహమ్మద్ రుబెల్ సర్కార్, మహమ్మద్ అల్ అమీన్, మహమ్మద్ నెసార్ అహ్మద్, షేక్ టోర్బల్ అలీ అని తెలిపారు.

కాగా.. ఓ వైపు కరోనా మహమ్మారి బీహర్‌లో విజృంభిస్తోంది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేస్తోంది.