దూసుకుపోతున్న బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లు

దేశీయ మార్కెట్లు గత ఐదు రోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాలతో పరుగులు తీస్తున్నాయి. ఈ ఉదయం లాభాలతో ప్రారంభమై…లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 522 పాయింట్లు పెరిగి 33825.53 వద్ద, నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 9979.10 వద్ద స్థిరపడ్డాయి. వరుస లాభాలతో ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఫైనాన్స్‌ రంగ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ 5.0లోని సడలింపులతో ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమైంది. ఈ 5 ట్రేడింగ్‌ సెషన్లలో బ్యాంకింగ్ నిఫ్టీ ఇండెక్స్‌ 18శాతం లాభపడింది. గత […]

దూసుకుపోతున్న బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లు
Follow us

|

Updated on: Jun 02, 2020 | 5:02 PM

దేశీయ మార్కెట్లు గత ఐదు రోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాలతో పరుగులు తీస్తున్నాయి. ఈ ఉదయం లాభాలతో ప్రారంభమై…లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 522 పాయింట్లు పెరిగి 33825.53 వద్ద, నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 9979.10 వద్ద స్థిరపడ్డాయి. వరుస లాభాలతో ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఫైనాన్స్‌ రంగ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ 5.0లోని సడలింపులతో ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమైంది. ఈ 5 ట్రేడింగ్‌ సెషన్లలో బ్యాంకింగ్ నిఫ్టీ ఇండెక్స్‌ 18శాతం లాభపడింది. గత 14 రోజుల్లో నిఫ్టీ పైనాన్స్‌ ఇండెక్స్‌ 17శాతం పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్‌ 563 పాయింట్ల వరకు లాభపడి 33,866.63 వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు పెరిగి 9,995.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి.