Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సి.ఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు. కంటైన్మేంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు. కంటైన్మంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ కేసు. కేజీహెచ్ లో రెండో రోజు ముగిసిన సీబీఐ విచారణ. కేజీహెచ్ వైద్యాధికారులతో మాట్లాడిన సీబీఐ అధికారి. సీసీ ఫుటేజీని పరిశీలించిన సీబీఐ. 16 న క్యాజువాల్టీలో డాక్టర్ సుధాకర్ కు పరీక్షలు చేసిన కేజీహెచ్ వైద్యులు.
  • ఢిల్లీ లో కరోనా విజృంభన. ఢిల్లీ లో కొత్తగా 1295 కరోనా పాజిటివ్ కేస్ లు ,13 మంది మృతి. ఢిల్లీ రాష్ట్రంలో 19844 కి చేరిన కరోనా కేసులు నమోదు. 473 మంది కరోనా తో మృతి
  • రుతుపవనాలు ఇంకా కేరళ తీరానికి తాకలేదు. దీని పై మేము క్రమం తప్పకుండా మానిటరింగ్ చేస్తున్నాం. జూన్ 1 నుండి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అనుకుంటున్నాం. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ సమీపంలో ఈ రోజు అల్ప పీడనం ఏర్పడింది. జూన్ 2 కి తుఫానుగా మారుతుందని మేము అనుకుంటున్నాం. జూన్ 3 సాయంత్రం నాటికి గుజరాత్ ,ఉత్తర మహారాష్ట్ర తీరం వైపుకు చేరుకుంటుంది. మృత్యుంజయ్ మోహపాత్రా, ఢిల్లీ IMD.
  • జమ్మూ కాశ్మీర్‌లో సీనియర్ ఐఎఎస్ అధికారి కి కరోనా పాజిటివ్‌. ఆయనతో పాటు సమావేశానికి హాజరైన పలువురు అధికారులు,వైద్యులను హోమ్ క్వారంటైన్ లో వెళ్లాలని సూచన.
  • మొబైల్ సేవల కోసం 11 అంకెల నంబరింగ్ ప్లాన్‌ను ట్రాయ్ సిఫారసు చేసినట్లు కొన్ని మీడియా సంస్థల లో వార్తలు వచ్చాయి. TRAI సిఫారసు ప్రకారం,దేశం లో 10-అంకెల నెంబర్ కొనసాగుతుంది. మేము 11-అంకెల నంబరింగ్ ప్లాన్‌కు మార్చడాన్ని ఖండిస్తున్నాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.

ఆర్థిక ప్యాకేజీ ఓ క్రూయెల్ జోక్.. సర్కార్‌పై సోనియా ఆగ్రహం

financial package is cruel joke, ఆర్థిక ప్యాకేజీ ఓ క్రూయెల్ జోక్.. సర్కార్‌పై సోనియా ఆగ్రహం

కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఒక క్రూయెల్ జోక్‌గా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. కరోనాను ఎదుర్కోవడంతో మోదీ ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానమంటూ లేదని ఆమె ఆరోపించారు. ఎలాంటి సంసిద్దత లేకుండా లాక్ డౌన్ అమల్లోకి తేవడం, దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక మోదీ ప్రభుత్వం గందరగోళ విధానాలను అవలంభిస్తోందని సోనియా గాంధీ విరుచుకుపడ్డారు.

శుక్రవారం మధ్యాహ్నం జరిగిన జాతీయ స్థాయి విపక్షాల సమావేశంలో సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆమె సునిశిత విమర్శలు చేశారు. ‘‘మార్చి 24వ తేదీన కేవలం 4 గంటల వ్యవధిలో లాక్‌డౌన్ ప్రకటించారు.. ఎలాంటి సంసిద్ధత లేకుండా లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారు.. అయినా సరే ప్రభుత్వానికి విపక్షాలు మద్ధతు ప్రకటించాయి.. 21 రోజుల మొదటి విడత లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తాయనుకున్నాం.. ప్రస్తుతం వ్యాక్సిన్ కనిపెట్టే వరకు వైరస్ మన మధ్యే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి.. ప్రభుత్వం 4 లాక్‌డౌన్లు అమలు చేస్తూ బయటపడే విధానం లేకుండా ఉన్నట్టు అనిపిస్తోంది.. వరుస లాక్‌డౌన్లు తీవ్ర దుష్ఫలితాలను అందించాయి.. టెస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.. ఈలోగా కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉంది.. ప్రధాని ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజి ఒక క్రూయెల్ జోక్‌గా నిలిచింది.. కరోనా మహమ్మారి కారణంగా వలస కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు.. వారితో పాటు 13 కోట్ల మంది రైతులు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు..’’ అని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు సోనియా గాంధీ.

financial package is cruel joke, ఆర్థిక ప్యాకేజీ ఓ క్రూయెల్ జోక్.. సర్కార్‌పై సోనియా ఆగ్రహం

ఇదిలా వుంటే.. కాంగ్రెెస్ పార్టీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన విపక్షాల సమావేశానికి సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు దూరంగా వున్నాయి. యూపీఏ కూటమిలోని ప్రధాన పార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవర్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, డిఎంకే అధినేత ఎం.కే.స్టాలిన్, ఉమర్ అబ్దుల్లా, సీతారామ్ ఏచూరీ, ప్రొ.కోదండరామ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

Related Tags