Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

పీవీ, మన్మోహన్ విధానాలే భేష్.. పరకాల ప్రభాకర్

 

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ భర్త, పొలిటికల్ ఎకనామిస్ట్ కూడా అయిన పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న తీరు పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ డైలీకోసం రాసిన ఆర్టికల్ లో ఆయన.. నాడు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అనుసరించిన ఆర్ధిక విధానాలే భేష్ అని అభిప్రాయపడ్డారు. లోగడ.. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్… పీవీ, మన్మోహన్ పాటించిన ఆర్ధిక విధానాలు నేటికీ సవాలు చేయలేనివిధంగా, ఉద్దీపనతో కూడినవిగా ఉన్నాయన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించడానికి సిధ్దంగా లేదని పేర్కొన్నారు. నాటి ఆ ఇద్దరు ప్రధానులూ పాటించిన విధానం ఆర్ధిక సరళీకరణకు మార్గాన్ని సుగమం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం నెహ్రు హయాంలోని సోషలిజాన్ని విమర్శించే బదులు.. ఆ పాలసీలను పాటించడం మంచిదని పరకాల ప్రభాకర్ అన్నారు. ఆర్ధిక వ్యవస్థ బాగాలేదనే వాదనను అంగీకరించడానికి ఈ ప్రభుత్వం సిధ్ధంగా లేదు. వాస్తవాలను ఒప్పుకోవడానికి విముఖత చూపుతోంది.. ఒకదాని తరువాత ఒకటిగా ఆయా రంగాలు పడిపోతున్న తీరు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అని ఆయన అన్నారు. ‘ బీజేపీ పొలిటికల్ ప్రాజెక్ట్ లో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఓ ‘ యోధుని ‘ గా ఎలా ఉన్నారో.. అలాగే దేశ ఆర్ధిక సంస్కరణల్లో పీవీ కూడా ఉన్నారు ‘ అన్నారాయన. అధికార పార్టీ చర్య ఆర్ధిక విమర్శగా లేదని, అది రాజకీయ దాడిగానే మిగిలిపోయిందని.. కానీ ఈ విషయాన్ని పార్టీ ఇంకా గుర్తించడం లేదని పరకాల పేర్కొన్నారు. బీజేపీలోని మేధావి వర్గం ఎంతసేపూ విమర్శలు చేస్తున్నంత మాత్రాన.. అవి ఎకానమీ పురోగమనానికి దారి తీస్తాయా అని ప్రశ్నించారు.
కాగా- ఈ ఆర్టికల్ గురించి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించినప్పుడు.. జీఎస్టీ, ఆధార్ వంటి పథకాలు, ఇతర ప్రజా ప్రయోజన కార్యక్రమాలు ఎకానమీ వృద్దికి దోహదపడడం లేదా అని క్లుప్తంగా వ్యాఖ్యానించారు. ఆర్ధిక వృద్ద్ధిరేటును పెంచేందుకు కేంద్రం ఇప్పటికే కార్పొరేట్ పన్నును తగ్గించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అటు-తాజాగా ప్రపంచ బ్యాంకు భారత్ కు సంబంధించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ది రేటును ఒకటిన్నర శాతానికి కుదించిన విషయం గమనార్హం.