జంతువుల వ్యాక్సిన్ల‌కు రూ. 13, 343 కోట్లుః సీతారామ‌న్‌

వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాలు, మ‌త్స్య‌, డెయిరీ ప‌రిశ్ర‌మ‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్ప‌త్తుల‌కు ప్యాకేజీ ప్ర‌క‌టించారు.

జంతువుల వ్యాక్సిన్ల‌కు రూ. 13, 343 కోట్లుః సీతారామ‌న్‌
Follow us

|

Updated on: May 15, 2020 | 6:08 PM

మూడో విడ‌త ఆర్థిక ప్యాకేజీలో 11 అంశాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాలు, మ‌త్స్య‌, డెయిరీ ప‌రిశ్ర‌మ‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్ప‌త్తుల‌కు ప్యాకేజీ ప్ర‌క‌టించారు. అందులో భాగంగానే జంతువులు, వాటికి అవ‌స‌ర‌మైన మందుల‌పై కూడా కేటాయింపులు ప్ర‌క‌టించారు.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

దేశంలోని గేదెలు, ఆవులు, గొర్రెలు, పందులు స‌హా ఇత‌ర జంతువుల‌కు సంబంధించి వ్యాధుల నియంత్ర‌ణ‌కు 100శాతం వ్యాక్సినేష‌న్లు చేస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ఇందుకోసం రూ. 13,343 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దీని ద్వారా 53 కోట్ల జంతువుల‌కు వ్యాక్సినేష‌న్ సౌక‌ర్యం అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ 1.5 కోట్ల ఆవులు, గేదెల‌కు వ్యాక్సిన్లు వేశామ‌న్నారు.