ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్‌ హైలైట్స్!

దేశ భద్రతే ప్రథమ కర్తవ్యమన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. తిరువళ్లూరు చెప్పిన ఐదు రత్నాలను ప్రస్తావిస్తూ.. రోగ రహితం, సంపద ఉండటం, మంచి పంటలు, ఆనందం, భద్రత ముఖ్యమన్నారు. ఈ ఆశయాలకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్, రైతుల ఆదాయం రెట్టింపు, ఆనందమయమైన జీవితం, సంపద సృష్టికర్తలపై గౌరవం, దేశ భద్రత అంశాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు నిర్మలా సీతారామన్. Budget Highlight ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2020 బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు.. పర్యాటక రంగానికి 2500 […]

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్‌ హైలైట్స్!
Follow us

| Edited By:

Updated on: Feb 01, 2020 | 6:39 PM

దేశ భద్రతే ప్రథమ కర్తవ్యమన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. తిరువళ్లూరు చెప్పిన ఐదు రత్నాలను ప్రస్తావిస్తూ.. రోగ రహితం, సంపద ఉండటం, మంచి పంటలు, ఆనందం, భద్రత ముఖ్యమన్నారు. ఈ ఆశయాలకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్, రైతుల ఆదాయం రెట్టింపు, ఆనందమయమైన జీవితం, సంపద సృష్టికర్తలపై గౌరవం, దేశ భద్రత అంశాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు నిర్మలా సీతారామన్.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2020 బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు..

  • పర్యాటక రంగానికి 2500 కోట్లు
  • క్లిన్ ఎయిర్ పాలసీకి 4400 కోట్లు
  • ఆరోగ్యరంగానికి 69,000 కోట్లు
  • నైపుణ్య శిక్షణకు 3 వేల కోట్లు
  • నేషనల్ టెక్స్ టైల్ మిషన్ కు 14 వందల కోట్లు
  • ఆరోగ్య రంగానికి 69 వేల కోట్లు
  • పౌష్టిక ఆహారానికి 35 వేల కోట్లు
  • రవాణా రంగానికి 1. 7 లక్ష్లల కోట్లు
  • ఆయుష్మాన్ భారత్ కు 6 వేల కోట్లు
  • భారత్ నెట్ కు 6  వేల కోట్లు
  • బ్యాంకింగ్ రంగానికి 3. లక్షల కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి 1.23 లక్షల కోట్లు
  • మౌలిక రంగానికి 1. లక్షల కోట్లు
  • జల్ జీవన్ మిషన్ కు 3.06 లక్షల కోట్లు
  • విద్యా రంగానికి 99,300 కోట్లు
  • విద్యుత్ రంగానికి 22 వేల కోట్లు
  • వ్యవసాయ రంగానికి 2.83 లక్షల కోట్లు
  • కోటి మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
  • కేంద్ర చట్టాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు
  • అంత్యోదయ స్కీమ్‌కు అత్యంత ప్రాధాన్యత
  • నీటి లభ్యత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించే పథకాలు
  • సౌరశక్తి ద్వారా పంపుసెట్ల నిర్వహణకు ప్రోత్సాహకం
  • కొత్తగా 15లక్షల మంది రైతులకు సోలార్ పంపులు
  • పాలు, చేపల రవాణాకు కిసాన్ రైలును ప్రారంభించనున్న భారతీయ రైల్వే
  • సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్ పోర్టల్
  • దేశంలో 160 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం
  • గ్రామాల్లో ధాన్యలక్ష్మి పథకం
  • కృషి ఉడాన్ పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి విమానాలు