ఇక ఉజ్వలంగా దేశ ఆర్ధిక వ్యవస్థ.. సవాళ్ళను ఎదుర్కొంటాం

ఈ ఏడాది ఇండియా 3 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్ధిక వృద్దిని సాధించడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇప్పటికే మన దేశం ఆర్ధిక రంగంలో చైనా, అమెరికా తరువాత మూడో అతి పెద్ద దేశంగా ఉందన్నారు.ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొంటామన్నారు. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆమె.. రాబోయే కొద్ది సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల మేర ఆర్ధిక వృధ్దిని సాధించడం పెద్ద కష్టమేమీ […]

ఇక ఉజ్వలంగా దేశ ఆర్ధిక వ్యవస్థ.. సవాళ్ళను ఎదుర్కొంటాం
Follow us

|

Updated on: Jul 05, 2019 | 1:45 PM

ఈ ఏడాది ఇండియా 3 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్ధిక వృద్దిని సాధించడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇప్పటికే మన దేశం ఆర్ధిక రంగంలో చైనా, అమెరికా తరువాత మూడో అతి పెద్ద దేశంగా ఉందన్నారు.ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొంటామన్నారు. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆమె.. రాబోయే కొద్ది సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల మేర ఆర్ధిక వృధ్దిని సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. వన్ నేషన్..వన్ గ్రిడ్ అనే ధ్యేయంతో దేశవ్యాప్తంగా విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్టు పేర్కొన్నారు. పవర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరలకు విద్యుత్ పంపిణీ చేయాలన్నదే లక్ష్యమని ఆమె వివరించారు. మేకిన్ ఇండియాకు మంచి స్పందన లభిస్తోందని, దేశంలో తయారయ్యే వస్తువులకు విదేశాల్లో మంచి డిమాండ్ లభిస్తోందని ఆమె తెలిపారు. భారత్ మాల ద్వారా రోడ్డు రవాణా, సాగర్ మాల ద్వారా జలరవాణా మెరుగుపడుతుందని, ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య మిస్తోందని ఆమె చెప్పారు. భారత్ మాల- రెండో దశలో రాష్ట్రాలకు సహకారం అందుతుందన్నారు. దేశంలో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయని, దీన్ని కట్టడి చేసేందుకు కొత్తగా అద్దె దారుల చట్టాన్ని తీసుకువస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రీఫార్మ్, పెర్ఫార్మ్ అన్న నినాదాన్ని ఆమె ప్రస్తావించారు. అంటే సంస్కరణలు.. పనితీరు మెరుగుదల అన్నవి ప్రధాన లక్ష్యాలని ఆమె వివరించారు. గ్రామీణ రుణాలను పెంచుతామని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు సరికొత్త పథకాలను ప్రవేశపెడతామని ఆమె తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇళ్ళు లేని పేదలందరికీ గృహవసతి కల్పించాలన్నదే ధ్యేయమన్నారు.నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వేగవంతం చేస్తామని చెప్పిన ఆమె.. దీన్ని దశలవారీగా చేపడతామన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..