2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం : ఆర్ధిక మంత్రి బుగ్గన

AP Budget, 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం : ఆర్ధిక మంత్రి బుగ్గన

రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ప్రధానాంశాల్లో ఒకటి పోలవరం ప్రాజెక్టు. దీని నిర్మాణపనులు నత్తనడకన సాగుతుండటంతో పనులుపూర్తి చేసేందుకు నిర్ధిష్ట కాలపరిమితి ప్రకారం ముందుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టును 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆర్ధిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు చిత్తశుద్దితో ముందుకు వెళ్తామన్నారు. పోలవరంతో పాటు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మొత్తం రూ. 13,139,13 కోట్లు కేటాయిస్తున్నట్టుగా ఆర్ధిక మంత్రి బుగ్గన తెలిపారు.

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సాగునీటికి ఆధారమైన వంశధార ప్రాజెక్టు, సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మంత్రి బుగ్గన తెలిపారు. అదే విధంగా అవుకు సొరంగాన్ని పూర్తి చేస్తామని, ఏడాది కాలంలో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఒకటో దశను పూర్తి చేస్తామని, రాయలసీమ ప్రాంతంలో గండికోట రిజర్వాయర్‌లో నీటి నిల్వ, కడప జిల్లాలోని ఆయకట్టుదారులకు నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాలోని చెరువులను నీటితో నింపేందుకు నిర్ణీత కాలవ్యవధిని అనుసరించి రెండో దశలో పూర్తి చేస్తామన్నారు మంత్రి. తమప్రభుత్వం సాగునీటి రంగానికి, రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆర్ధిక మంత్రి బుగ్గన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *