ప్రారంభమైన తుది దశ పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలో తుది దశ పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తుది విడతలో 161 జెడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ దశలో 30 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 27 జిల్లాల్లో 9,494 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 160 జెడ్పీటీసీ, 1708 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 160 జెడ్పీటీసీ స్థానాలకు 741 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. అలాగే 1708 ఎంపీటీసీ స్థానాలకు 5,726 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరగనుంది. తొలి విడతలో వాయిదా పడిన సిద్దిపేట జిల్లాలోని అల్వాల్, రంగారెడ్డి జిల్లాలోని అజీజ్‌నగర్ ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *