బ్రేకింగ్: 10, 12వ తరగతుల పరీక్షల నిర్వహణ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన సీబీఎస్‌ఈ

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో విద్యా సంస్థలు మూత పడ్డాయి. దీంతో జరగాల్సిన అన్ని పరీక్షలూ వాయిదా పడ్డాయి. చివరకు సీబీఎస్‌ఈ కూడా పరీక్షలు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వాయిదా పడ్డ 10వ, 12వ తరగతి పరీక్షల నిర్వహణపై...

బ్రేకింగ్: 10, 12వ తరగతుల పరీక్షల నిర్వహణ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన సీబీఎస్‌ఈ
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 5:39 PM

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో విద్యా సంస్థలు మూత పడ్డాయి. దీంతో జరగాల్సిన అన్ని పరీక్షలూ వాయిదా పడ్డాయి. చివరకు సీబీఎస్‌ఈ కూడా పరీక్షలు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వాయిదా పడ్డ 10వ, 12వ తరగతి పరీక్షల నిర్వహణపై క్లారిటీ ఇచ్చింది సీబీఎస్‌ఈ. సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 10, 12వ తరగతి పరీక్షలను జులై 1 నుంచి జులై 15వ తేదీ వరకూ నిర్వహించనున్నామని సీబీఎస్‌ఈ తాజాగా ఓ ప్రకటన చేసింది.

కాగా ఇదివరకే.. దేశ వ్యాప్తంగా జరగాల్సిన సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఈశాన్య ఢిల్లీ మినహా కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి పెండింగ్‌లో ఉన్న వార్షిక పరీక్షలను నిర్వహించబోమని చెప్పారు. ఈశాన్య ఢిల్లీకి చెందిన విద్యార్థులు మాత్రం పరీక్షలు రాయాలని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. కాగా ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు మాత్రం.. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 10 రోజుల సమయం ఇస్తామని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు పోఖ్రియాల్. ఈ నేపథ్యంలో.. 10, 12వ తరగతి పరీక్షలను జులై 1 నుంచి జులై 15వ తేదీ వరకూ నిర్వహించనున్నామని తాజాగా సీబీఎస్‌ఈ ప్రకటన చేసింది.

Read More:

వాహనదారులకు గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వెహికల్స్‌ విడుదలకు గ్రీన్ సిగ్నల్

గుడ్‌న్యూస్: ఫేస్‌బుక్‌ నుంచి త్వరలో ఫ్రీ ఇంటర్నెట్

సినిమాల్లో ఛాన్స్‌ ఇస్తా అంటూ అమ్మాయిలకు వల.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్