దొంగనోట్ల ప్రింటింగ్‍లో ‘స్క్రిప్ట్ రైటర్’

ముంబయిలోని ఎస్.వి.రోడ్‌లో సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి బ్యాగును తనిఖీ చేయగా దొంగనోట్లు కనిపించాయి. సినిమాలకు స్క్రిఫ్టులు రాసే రామ్‌రతన్ పటేల్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నలసొపరలోని అతడిని ఇంటిని తనిఖీ చేయగా రూ.5లక్షల విలువైన రూ.500, రూ.2000 నోట్లు బయటపడ్డాయి. వాటితో పాటు కంప్యూటర్, స్కానర్, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తనకు ఇద్దరు భార్యలున్నారని, తనకొచ్చే ఆదాయంతో ఇద్దరినీ పోషించడం కష్టంగా మారడంతోనే దొంగనోట్లు ప్రింట్ […]

దొంగనోట్ల ప్రింటింగ్‍లో 'స్క్రిప్ట్ రైటర్'
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2019 | 12:17 PM

ముంబయిలోని ఎస్.వి.రోడ్‌లో సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి బ్యాగును తనిఖీ చేయగా దొంగనోట్లు కనిపించాయి. సినిమాలకు స్క్రిఫ్టులు రాసే రామ్‌రతన్ పటేల్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నలసొపరలోని అతడిని ఇంటిని తనిఖీ చేయగా రూ.5లక్షల విలువైన రూ.500, రూ.2000 నోట్లు బయటపడ్డాయి. వాటితో పాటు కంప్యూటర్, స్కానర్, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తనకు ఇద్దరు భార్యలున్నారని, తనకొచ్చే ఆదాయంతో ఇద్దరినీ పోషించడం కష్టంగా మారడంతోనే దొంగనోట్లు ప్రింట్ చేస్తున్నట్లు పటేల్ పోలీసులకు చెప్పాడు. నకిలీ నోట్లను మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ మారుస్తున్నట్లు చెప్పడంతో పోలీసుల అవాక్కయ్యారు. నిందితుడు ఇప్పటికే రూ.15లక్షల మేర దొంగనోట్లు చెలామణి చేసిట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.