బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు అందరిదీ అదే దారి.. ఏంటంటే..!

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు కేవలం సినిమాలనే నమ్ముకున్న సినిమా వాళ్లు ఇప్పుడు డిజిటల్‌ను నమ్ముకుంటున్నారు. అందులో ముఖ్యంగా వెబ్ సిరీస్ చేస్తూ కోట్లు గడిస్తున్నారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు, హీరోయిన్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు డిజిటల్ వైపే చూస్తున్నారు. అందరూ నిర్మాతలుగా మారిపోయి వెబ్‌ సిరీస్‌లను చేస్తున్నారు. ముఖ్యంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, వూట్, వ్యూ, జీ5, హాట్ స్టార్ వంటి తదితర డిజిటల్ […]

బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు అందరిదీ అదే దారి.. ఏంటంటే..!
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2019 | 5:30 PM

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు కేవలం సినిమాలనే నమ్ముకున్న సినిమా వాళ్లు ఇప్పుడు డిజిటల్‌ను నమ్ముకుంటున్నారు. అందులో ముఖ్యంగా వెబ్ సిరీస్ చేస్తూ కోట్లు గడిస్తున్నారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు, హీరోయిన్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు డిజిటల్ వైపే చూస్తున్నారు. అందరూ నిర్మాతలుగా మారిపోయి వెబ్‌ సిరీస్‌లను చేస్తున్నారు. ముఖ్యంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, వూట్, వ్యూ, జీ5, హాట్ స్టార్ వంటి తదితర డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో హిందీ వెబ్‌ సిరీస్‌ల హవా కొనసాగుతోంది.

ఈ క్రమంలో ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నెట్‌ఫ్లిక్స్‌లో రెండు ఒరిజినల్ ఫిల్మ్‌ను నిర్మించబోతున్నారు. ఈ విషయంపై ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా మాట్లాడుతూ.. ‘‘అన్ని కథలను సినిమాలుగా చూపించలేము. అలాంటి వాటిని వెబ్‌ సిరీస్‌లో చూపించేందుకు డిజిటల్ ఫ్లాట్‌ఫాంలు ఉపయోగపడుతాయి’’ అని తెలిపాడు. కాగా ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న గిల్టీ, డ్రైవ్ అనే ఒరిజనల్ ఫిల్మ్ ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో రానున్నాయి. అలాగే ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్(ఫర్హాన్ అక్తర్, రితేష్ సద్వానీ)అమెజాన్లో ఎడ్జ్, మిర్జాపూర్, మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించింది. వీటిన్నింటికి మంచి పేరు కూడా వచ్చింది. మరోవైపు ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్.. వ్యూ యాప్‌లో గెహ్రియాన్, స్పాట్‌లైట్ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించారు. ఇక ఇటీవల ప్రైమ్‌లో ఫ్యామిలీ మ్యాన్ పేరుతో D2R సంస్థ ఓ వెబ్ సిరీస్‌ను విడుదల చేయగా.. దానికి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. వీటితో పాటు ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌తో షారూక్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బార్డ్ ఆఫ్ బ్లడ్ అనే సిరీస్‌ను నిర్మించింది. ఈ సిరీస్‌ కూడా మంచి పేరు సాధించగా.. ఇదే సినిమాగా తెరకెక్కి ఉంటే మరోలా ఉండేదంటూ విమర్శకులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇక సాక్రెడ్ గేమ్స్, డోన్డ్ బ్రీత్, లస్ట్ స్టోరీస్, 4 షాట్స్, ద ఫైనల్ కాల్, అభయ్ వంటి ఎన్నో సిరీస్‌లు డిజిటల్‌లో మంచి పేర్లు తెచ్చుకున్నాయి.

ఓ సినిమాకు పట్టే సమయం కంటే వెబ్ సిరీస్‌కు తక్కువగానే పడుతుంది. దానికి తోడు ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు. వ్యూయర్స్‌ను అట్రాక్ట్ చేసేలా కొత్త కొత్త కథలను సృష్టించొచ్చు. వీటితో పాటు వెబ్ సిరీస్‌లకు డిజిటల్ ఫ్లాట్‌ఫాంలు ఇప్పుడు భారీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. దీంతో డిజిటల్ వైపే ఇప్పుడు అందరూ చూస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ఉత్తరాది సినీ ఇండస్ట్రీ వారు మాత్రమే వెబ్ సిరీస్‌లు తీస్తుండగా.. త్వరలోనే దక్షిణాది దర్శకులు, నిర్మాతలు కూడా ఆ ఫ్లాట్‌ఫాంవైపు అడుగులు వేస్తారేమో చూడాలి.