కల నిజమైంది.. ‘కాళేశ్వరం’పై ప్రముఖుల ప్రశంసలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ కాళేశ్వర మహోజ్వల ఘట్టం ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కేసీఆర్.. దానిని జాతికి అంకితం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కళ్లలో ఆనందం నింపే దిశగా అడుగులేసిన కేసీఆర్.. ఈ ప్రాజెక్ట్‌ను మూడు సంవత్సరాలలో పూర్తి చేయించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌పై మాస్‌రాజా రవితేజ ట్వీట్ చేస్తూ.. ‘‘ఇంజనీరింగ్ నైపుణ్యానికి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రతీక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ సీఎంవో, కేటీఆర్‌కు కంగ్రాట్స్. అలాగే ఈ కలను నిజం చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్’’ అంటూ కామెంట్ పెట్టారు.

అలాగే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్‌పై ట్వీట్ చేస్తూ.. ‘‘ప్రకాశ్.. ఇది నా కల అని కేసీఆర్ గారు నాకు చెప్పారు. ఈ కలం నిజం చేసుకునేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. ఇవాళ ఆ కల నెరవేరింది. తెలంగాణకు కంగ్రాట్స్. గొప్ప విజనరీ కలిగిన కేసీఆర్‌కు థ్యాంక్స్’’ అని కామెంట్ పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *