Breaking News
  • విశాఖ శారదాపీఠంలో విషజ్వర పీడా హర యాగానికి పూర్ణాహుతి. 11 రోజుల పాటు సాగిన అమృత పాశుపత సహిత యాగం. యాగాన్ని పర్యవేక్షించిన శారదా పీఠాధిపతులు.. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర.
  • కరోనా వల్ల ఆక్వా రంగం ఇబ్బందుల్లో ఉంది. వాలంటీర్ల ద్వారా ప్రజల సమాచారం సేకరిస్తున్నాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూస్తున్నాం-మోపిదేవి.
  • ప్రజల రాకపోకలపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాం-మంత్రి కన్నబాబు. కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడం. ప్రజలకు సాయం అందించడం. ఫారెన్‌ రిటర్న్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక వ్యూహం-కన్నబాబు.
  • రాష్ట్రంలో పాల సరఫరాపై వివిధ డైరీలతో మంత్రి తలసాని సమీక్ష. డోర్‌డెలివరీ యాప్‌ల ద్వారా పాల సరఫరా. పాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు-మంత్రి తలసాని. పాల వాహనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు-తలసాని.
  • నిజామాబాద్‌లో కల్లు దొరకక ఇద్దరు మృతి. లాక్‌డౌన్‌ కారణంగా వారం రోజులుగా దొరకని కల్లు.
  • లాక్‌డౌన్‌తో చెన్నైలో విజయనగరం వాసుల అవస్థలు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న కూలీలు. టీవీ9కు తమ గోడు చెప్పుకున్న కూలీలు.

వైసీపీలో వార్: శ్రీచైతన్యకి, కోటంరెడ్డికి లింకేంటి..?

Fight between Kotamreddy and Kakani Govardhan Reddy in Nellore District, వైసీపీలో వార్: శ్రీచైతన్యకి, కోటంరెడ్డికి లింకేంటి..?

వైసీపీలో వార్ షురూ అయ్యిందా..? ఆ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా..? అంటే.. అవుననే అనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందా..? అక్కడ జరిగిన ఘటనను చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఇటీవలే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఎంపీడీవో సరళ మీద దాడి చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో.. ఆయనపై కేసు కూడా నమోదయ్యింది. ఈ క్రమంలో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలతో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అనుచరుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. దీంతో.. నెల్లూరులో కాకాణి గోవర్థన్ రెడ్డి వర్సెస్ కోటంరెడ్డిగా మారింది.

ఎంపీడీవో సరళ తనపై అసత్య ఆరోపణలు చేశారని.. ఇంటిపై దాడి చేశారని చెబుతోన్న ఎంపీడీవో.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఎమ్మెల్యే కాకాణి ఇంటికెళ్లారని ఆయన ఆరోపించారు. జిల్లా ఎస్పీతో తనకు వ్యక్తిగత విభేదాలున్నాయని.. దీనిపై నాలుగు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని.. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని సీఎం చెబితే.. ఎస్పీ వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారన్నారు. అర్థరాత్రి తమ ఇళ్లపై దాడులు చేసి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.

Fight between Kotamreddy and Kakani Govardhan Reddy in Nellore District, వైసీపీలో వార్: శ్రీచైతన్యకి, కోటంరెడ్డికి లింకేంటి..?

అలాగే.. కోటంరెడ్డి బంధువు కృష్ణారెడ్డి వెంకటాచలం మండలంలో.. ఓ రియల్‌ ఎస్టెట్ విషయంలో కూడా తగాదా లేచింది. ఆ రియల్ ఎస్టేట్‌కి.. వాటర్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. దానికి ఎంపీడీవో ఫోన్ చేసి విషయం అడిగితే.. మా ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దన్నారు అని చెప్పారని కోటంరెడ్డి స్వయంగా వెల్లడించారు. ఇదే విషయంలో కోటం రెడ్డి.. కాకాణీకి ఫోన్ చేసినా.. నువ్వు ఊరుకో అని చెప్పారని మీడియాకు వెల్లడించారు.

Fight between Kotamreddy and Kakani Govardhan Reddy in Nellore District, వైసీపీలో వార్: శ్రీచైతన్యకి, కోటంరెడ్డికి లింకేంటి..?

నెల్లూరులో వైసీపీ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. అసెంబ్లీ స్థానంలోనూ విజయం సాధించింది. అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. జిల్లాలో పట్టుకోసం మాత్రం ఆ నేతల్లో వాళ్లల్లో వారికే ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎవరికి వారు తమ హవా నడిపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. కోటం రెడ్డి, కాకాణి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. కాకాణి ఒత్తిడి వల్లే తన మీద వ్యక్తిగతంగా కక్ష తీర్చుకుంటున్నారని మీడియా ముందు బహిరంగంగా తన అక్కసును వెల్లగక్కుతున్నారు.

Related Tags