బ్రేకింగ్: చంద్రబాబు అరెస్ట్..

విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బెంజ్ సర్కిల్ ప్రాంతంలో జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఆటోనగర్ వరకు చంద్రబాబు, జేఏసీ నేతలు పాదయాత్ర వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, జేఏసీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటు అమరావతి జేఏసీ చేపట్టిన బస్సు యాత్రకు కూడా పోలీసులు బ్రేక్ వేశారు. ఇక దీన్ని నిరసిస్తూ చంద్రబాబు, అఖిలపక్ష […]

బ్రేకింగ్: చంద్రబాబు అరెస్ట్..
Follow us

|

Updated on: Jan 08, 2020 | 9:20 PM

విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బెంజ్ సర్కిల్ ప్రాంతంలో జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఆటోనగర్ వరకు చంద్రబాబు, జేఏసీ నేతలు పాదయాత్ర వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, జేఏసీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అటు అమరావతి జేఏసీ చేపట్టిన బస్సు యాత్రకు కూడా పోలీసులు బ్రేక్ వేశారు. ఇక దీన్ని నిరసిస్తూ చంద్రబాబు, అఖిలపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పోలీసులు సీజ్ చేసిన బస్సులను వెంటనే తిరిగి అప్పగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇలా చేస్తే తిరుగుబాటు వస్తుందని.. ప్రజలు తిరుబాటు చేస్తే పోలీసులేమి చేయలేరని ఆయన తెలిపారు. కాగా, ఉద్రిక్తత తీవ్రతరం కావడంతో చంద్రబాబు, లోకేష్‌తో సహా జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవినేని ఉమ, అశోక్ బాబు, రామానాయుడు, అచ్చెన్నాయుడు, పంచుమర్తి అనురాధ, ప్రత్తిపాటి పుల్లారావులను అరెస్ట్ చేశారు. దీనితో సీఎం డౌన్ డౌన్ అంటూ అఖిలపక్ష నేతలు నినాదాలు చేస్తున్నారు.