ఇందిరా మహోన్నత నిర్ణయానికి 50ఏళ్లు

భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప నాయకుల్లో ఇందిరా గాంధీ పేరు కచ్చితంగా ఉంటుంది. ప్రధానమంత్రిగా ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలన అప్పట్లో ప్రజలకు ఇబ్బంది కలిగినప్పటికీ.. మరికొన్ని ఇప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతున్నాయి. వాటిలో బ్యాంకుల జాతీయం ఒకటి. భారతదేశంలోని బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉండటం వల్లనే ఎలాంటి పరిస్థితులు వచ్చినా భారతదేశ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడుతుందని ఆర్థిక నిపుణులు తరచూ చెబుతుంటారు. కాగా సరిగ్గా 50ఏళ్ల క్రితం ప్రైవేట్ రంగంలో ఉన్న 14బ్యాంకుల్ని ఆమె […]

ఇందిరా మహోన్నత నిర్ణయానికి 50ఏళ్లు
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2019 | 5:37 PM

భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప నాయకుల్లో ఇందిరా గాంధీ పేరు కచ్చితంగా ఉంటుంది. ప్రధానమంత్రిగా ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలన అప్పట్లో ప్రజలకు ఇబ్బంది కలిగినప్పటికీ.. మరికొన్ని ఇప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతున్నాయి. వాటిలో బ్యాంకుల జాతీయం ఒకటి. భారతదేశంలోని బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉండటం వల్లనే ఎలాంటి పరిస్థితులు వచ్చినా భారతదేశ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడుతుందని ఆర్థిక నిపుణులు తరచూ చెబుతుంటారు. కాగా సరిగ్గా 50ఏళ్ల క్రితం ప్రైవేట్ రంగంలో ఉన్న 14బ్యాంకుల్ని ఆమె జాతీయం చేశారు.

కాగా 1947-1955 మధ్యన ఏడాదికి సగటున 40కి చొప్పున 360కి పైగా బ్యాంకులు విఫలమయ్యాయి. ఇక ఇది 1960వరకు కొనసాగింది. ఇక ఆ సమయంలో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ భారీగా బ్యాంకు కన్సాలిడేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 1960 నుంచి 1965 మధ్య భారీగా బ్యాంకుల్ని రద్దు చేశారు. దీంతో 328 బ్యాంకులకు గానూ కేవలం 68 బ్యాంకులు మాత్రమే మిగిలాయి. ఇక 1967లో మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేప్టటిన ఇందిరా గాంధీ.. మళ్లీ మొర్జారీ దేశాయ్‌నే ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. అయితే ఆ సమయంలో ఇందిరా ప్రభుత్వానికి మరో సవాల్ ఎదురైంది. వ్యవసాయానికి, పరిశ్రమలకు ఆర్థిక సహకారాన్ని బ్యాంకులు నిలిపివేశాయి. దీంతో దేశ ప్రజల ఆర్థిక శక్తి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో బ్యాంకుల్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకురావాలని భావించిన ఇందిరా.. 1969 జూలై 12న బ్యాంకుల్ని జాతీయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత జూలై 18న ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా.. ఆ మరుసటి రోజు(జూలై 19న)సాయంత్రం 5గంటలకు ఆమోదం లభించింది. ఇక అదే రోజు రాత్రి ఇందిరా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో దేశ ప్రజలు ఆనందంలో మునిగి తేలగా.. వ్యాపారవర్గాలు మాత్రం ఖంగుతిన్నాయి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..