Breaking News
  • హైదరాబాద్: వరదల కారణంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కలరా, టైఫాయిడ్,గ్యాస్ట్రో ఎంటైటిఎస్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. -ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ . ఫీవర్‌ ఆస్పత్రిలో 600 వరకు ఓపీ కొనసాగుతుంది. అంటు వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి- శంకర్ .
  • విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్‌, సీపీ. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు సూచనలు . ఎల్లుండి అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు- కలెక్టర్ ఇంతియాజ్. ఇంద్రకీలాద్రిపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం- సీపీ శ్రీనివాసులు .
  • గుంటూరు: బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై వైసీపీ సంబరాలు. నగరపాలెంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రులు. బీసీల అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడివున్నారు- మంత్రి సుచరిత. గతంలో బీసీలను ఓటు బ్యాంకుగా చూశారు- మంత్రి సుచరిత. బీసీల సంపూర్ణ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - మంత్రి రంగనాథ్‌రాజు . బీసీల్లో ఇన్ని కులాలు ఉన్నాయన్న సంగతీ ఎవరికీ తెలియదు-మంత్రి రంగనాథ్‌రాజు.
  • హైకోర్టులో విచారణ: ఉస్మానియా ఆసుపత్రిలో వరద చేరకుండా చర్యలు తీసుకోవాలి-హైకోర్టు . ఆసుపత్రిలో వరద, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదన్న పిల్‌పై హైకోర్టులో విచారణ. వరద బయటకు వెళ్లే సౌకర్యం లేక ఆసుపత్రిలోకి నీరు చేరుతుంది-పిటిషనర్‌. ఆసుపత్రిలోకి వస్తున్న వరద మూసీలోకి వెళ్లేలా ఏర్పాటు చేయాలని ఆదేశాలు . రోగులు ఇబ్బంది పడకుండా తగిని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు . తదుపరి విచారణ నవంబర్‌12కి వాయిదా .
  • ప్రధాని మోదీ కామెంట్స్‌: ఢిల్లీ: యువ‌త‌ను మ‌రింత స‌మ‌ర్థవంతంగా మార్చేందుకు.. బ‌హుళ ప‌ద్దతిలో విద్యార్థుల‌పై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఉద్యోగ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు యువ‌త‌ను తీర్చిదిద్దే ప్రయత్నం జరగాలి . ఐఐఎంల‌కు మ‌రిన్ని అధికారాలు ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటన . విద్యా వ్యవస్థలో మ‌రింత పార‌ద‌ర్శకత కోసమే నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్‌ ఏర్పాటు.

పండగ సీజన్: రైల్వే ప్రయాణీకులకు కీలక మార్గదర్శకాలు..

దసరా, దీపావళి పండగల దృష్ట్యా మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు సిద్దం చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కరోనా..

Guidelines For Railway Passengers, పండగ సీజన్: రైల్వే ప్రయాణీకులకు కీలక మార్గదర్శకాలు..

దసరా, దీపావళి పండగల దృష్ట్యా మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు సిద్దం చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కరోనా మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. ప్రయాణీకులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే భద్రతా దళం(ఆర్‌పీఎఫ్‌) వెల్లడించింది. ఈ క్రమంలోనే పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ప్రయాణీకులకు ఉల్లంఘిస్తే జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. (Guidelines For Railway Passengers)

ఆర్‌పీఎఫ్‌ మార్గదర్శకాలు ఇవే…

  • రైల్వే పరిసరాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి
  • భౌతిక దూరం పాటించాలి
  • వైద్య బృందం చెకప్ చేయడాన్ని నిరాకరిస్తే చర్యలు తప్పవు
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా, చెత్త వేసినా శిక్ష తప్పదు
  • రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో పరిశుభ్రమైన వాతావరణాన్ని ఉంచేందుకు తోడ్పడాలి

Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే.!

Related Tags