Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

ఎన్నికల షెడ్యూల్ విడదలైన అనంతరం మోదీ తొలి ట్విట్

, ఎన్నికల షెడ్యూల్ విడదలైన అనంతరం మోదీ తొలి ట్విట్

లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదలైన వెంటనే మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘ప్రజాస్వామ్య పండుగకు చెందిన ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తొలి సారి ఓటు వేయబోతున్న వారు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎన్నికల కమిషన్ కు, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, భద్రతా సిబ్బందికి అభినందనలు. ఎన్నో ఏళ్లుగా ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్ ను చూసి గర్విస్తున్నా. 2014 ఎన్నికల్లో యూపీఏని ప్రజలు తిరస్కరించారు. వ్యవస్థను నాశనం చేసిన, అవినీతికి పాల్పడిన యూపీఏ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. యూపీఏను మరోసారి తిరస్కరించేందుకు ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న అన్ని పార్టీల అభ్యర్థులకు శుభాకాంక్షలు. మనమంతా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ… అందరి లక్ష్యం దేశ అభివృద్ధి, ప్రతి భారతీయుడి పురోగతి. 2019 ఎన్నికలు భారతీయుల ఆత్మస్థైర్యానికి నిదర్శనం కాబోతున్నాయి. ప్రతి భారతీయుడి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా జరగనున్నాయి.

ఆర్థికంగా భారత్ వేగంగా ఎదుగుతోంది. ఉగ్రవాదానికి సరైన సమాధానం ఇస్తోంది. రికార్డు స్థాయిలో పేదరికం నుంచి బయటపడుతోంది. స్వచ్ఛ భారత్ గా అవతరిస్తోంది. అవినీతిపరులను చట్టం ముందు నిలబెడుతోంది. ఈ విషయాలన్నీ ప్రతి భారతీయుడికీ తెలుసు. మరింత వేగంగా అభివృద్ధి వైపు భారత్ అడుగులు వేస్తోంది. కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలు ఆదాయ పన్ను నుంచి మినహాయింపును పొందారు. 12 కోట్ల రైతు కుటుంబాలు ప్రతి ఏటా రూ. 6000 పొందుతున్నాయి. 42 కోట్ల మంది వృద్ధాప్య పింఛన్లను పొందుతున్నారు. 50 కోట్ల మంది నాణ్యమైన, ఉచిత వైద్యాన్ని పొందుతున్నారు. 2.5 కోట్ల మంది తొలిసారి విద్యుత్ సౌకర్యాన్ని పొందారు. 1.5 కోట్ల మంది సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. సరైన విధివిధానాలు, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగితే… ఇలాంటివి ఎన్నో సాధించవచ్చు.

‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ నినాదంతో ముందుకు వచ్చిన ఎన్డీయే మరోసారి మీ అందరి ఆశీస్సులను కోరుతోంది. 70 ఏళ్లుగా పరిష్కారం కాని ప్రాథమిక అవసరాలను గత ఐదేళ్లలో పూర్తి చేశాం. ఈ పునాదులపై మరింత బలమైన, సురక్షితమైన, శ్రేయస్కరమైన భారత్ ను నిర్మించుకుందాం’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.