గర్భిణిని బూటు కాలితో తన్నిన లేడీ ఎస్పీ!

Odisha: Female IPS officer booked for kicking pregnant lady who suffered miscarriage, గర్భిణిని బూటు కాలితో తన్నిన లేడీ ఎస్పీ!

భువనేశ్వర్‌:  గర్భిణి అనికూడా చూడకుండా పొత్తికడుపు మీద బూటుకాలితో తన్నింది ఓ లేడీ ఎస్పీ. దీంతో సదరు మహిళ అమ్మ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో  ఆ పోలీసు ఉన్నతాధికారిపై చర్య తీసుకోవాలని బాధితురాలు ఒడిశా న్యాయస్థానాన్ని వేడుకుంది. కేసును పరిశీలించిన జడ్జి ఆ లేడీ ఆఫీసర్ మీద క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే… జులై 3న సుందర్‌గఢ్‌ జిల్లాలోని కణిక గ్రామంలో కారు ఢీకొని ఒక యువకుడు మృతిచెందడంతో.. అందుకు కారకులయినవారిని అరెస్టుచేసి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు పోలీసు స్టేషన్‌ వద్ద బైఠాయించారు. పోలీసులు తీరుతో విసిగిపోయిన కొందరు విధ్వంసానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరుగా అభియోగాన్ని ఎదుర్కొంటున్న వారిలో బాధితురాలు ప్రియాడే భర్త ఉత్తమ్‌ డే కూడా ఒకరు. కేసు దర్యాప్తును చేపట్టిన ఎస్పీ సౌమ్య మిశ్రా.. ఉత్తమ్‌ డే ఆచూకీ చెప్పాలంటూ తనను కొట్టారని, పొట్టమీద బూటు కాళ్లతో తన్నారని, అందువల్ల తనకు గర్భవిచ్ఛితి జరిగిందని ఎస్పీని శిక్షించి తనకు న్యాయం చేయాలని.. ప్రియా డే కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *