రన్ వేపై వర్షం నీరు.. కార్గో విమానానికి తప్పినముప్పు

నిసర్గ తుఫాను కారణంగా ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్ ‌పోర్టులో రన్‌వే పై వరద నీరు. పెడెక్స్ కార్గో విమానానికి తప్పిన ప్రమాదం.

రన్ వేపై వర్షం నీరు.. కార్గో విమానానికి తప్పినముప్పు
Follow us

|

Updated on: Jun 03, 2020 | 7:05 PM

పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెడెక్స్ కార్గో విమానానికి పెను ప్రమాదం తప్పింది. నిసర్గ తుఫాను కారణంగా కురిసిన వర్షంతో ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్ ‌పోర్టులో రన్‌వే పై వరద నీరు చేరింది. గురువారం బెంగుళురు నుంచి వచ్చిన ఫెడెక్స్‌ కార్గో విమానం రన్‌ వే నుంచి దూరంగా ల్యాండ్‌‌ అయింది. ఈ విమానానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, విమాన కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు వెల్లడించారు. అయితే, ముంబై ఎయిర్‌ పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. తుపాన్‌ కారణంగా ముంబైకి ఎయిర్‌ పోర్టుకు వచ్చే మొత్తం 19 విమానాల రాక పోకలను నిలిపి వేస్తున్నట్లు అధికారులు పేర్కోన్నారు. నిసర్గ తుపాన్‌ ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్‌పోర్టును రాత్రి 7గంటల వరకు మూసివేశారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్‌ విధించినట్లు గ్రేటర్‌ ముంబై పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు.