
మీ బడ్జెట్‌లో ఇమిడిపోయే ఒక తిరిగి చెల్లింపు ప్రణాళికను తెలుసుకోవటానికి పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ మీరు ఋణం కోసం దరఖాస్తు చేసే ముందు మీ నెలవారి తిరిగి చెల్లింపులను అంచనా వేయడంలో సహాయపడుతుంది. వివిధ ఋణ కాల వ్యవధులు, ఈఎంఐ మొత్తాలను పోల్చి చూడడం ద్వారా మీరు మీ బడ్జెట్‌లో సౌకర్యవంతంగా ఇమిడిపోయే, మీ ఆర్ధిక లక్ష్యాలకు సహకరించే ఒక తిరిగి చెల్లింపు ప్రణాళికను ఎంచుకోవచ్చు. ఋణ మొత్తం, వడ్డీ రేటు, తిరిగి చెల్లింపు కాలవ్యవధి ఆధారంగా మీ ఈఎంఐని అంచనా వేయడానికి పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ సహాయపడుతుంది. మీరు అనేక కాలవ్యవధి ఈఎంఐలను పోల్చి చూసి మీ బడ్జెట్‌కు సరిపోయే ఒక తిరిగి చెల్లింపు ప్రణాళికను ఎంచుకోవచ్చు.
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు ఉండే ఋణ మొత్తాలతో 12 నెలల నుండి 108 నెలల వరకు ఉండే తిరిగి చెల్లింపు కాలవ్యవధులను అందిస్తుంది. అర్హులైన ఋణగ్రహీతలు వార్షికంగా 10 శాతం నుండి 30 శాతం వరకు ఉండే వడ్డీ రేట్లు, త్వరిత ఆమోదం, 24 గంటల్లోపు పంపిణీ, తాకట్టు అవసరం లేని నామమాత్రపు డాక్యుమెంటేషన్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు.
ఒక పర్సనల్ లోన్ తీసుకునే ముందు ప్రతినెల మీరు ఎంత తిరిగి చెల్లిస్తారు అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ క్షణాలలో మీ నెలవారి వాయిదాలను అంచనా వేసి తెలపడం ద్వారా మీరు ముందుగానే ప్రణాళిక చేసుకోవటానికి సహాయపడుతుంది. ఊహలపై ఆధారపడకుండా కాలిక్యులేటర్ ఉపయోగించి మీరు మీ నెలవారి ఈఎంఐ అంచనా వేయవచ్చు. వివిధ తిరిగి చెల్లింపు కాలవ్యవధులను పోల్చి చూడవచ్చు స్థోమత ఆధారంగా ఋణ మొత్తాన్ని సరిచేయవచ్చు.మీ నెలవారి బడ్జెట్ ను మరింత సమర్థవంతంగా ప్రణాళిక చేయవచ్చు. మరింత నమ్మకంగా ఋణము తీసుకోవచ్చు. మీకు ఒక వైద్య అత్యవసర పరిస్థితి, ఇంటి పునరుద్ధరణ, ప్రయాణము, ఉన్నత విద్య లేదా ఒక పెళ్ళి వంటి వాటికి దేని కోసమైనా నిధులు అవసరమైనప్పుడు అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకొనుటకు ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ మీకు సహాయపడగలదు.
ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించడం చాలా సులభం. కేవలం కొన్ని నిమిషాల సమయం మాత్రమే పడుతుంది
దశ 1: ఋణ మొత్తాన్ని ఎంటర్ చేయండి
-మీరు తీసుకోవాలని అనుకుంటున్న ఋణ మొత్తాన్ని ఎంటర్ చేసి మొదలుపెట్టండి. ఆ మొత్తము మీకు నిజంగా ఉన్న ఆర్ధిక ఆవశ్యకతకు సరిపోలాలి
దశ 2: వడ్డీ రేటును ఎంటర్ చేయండి
-తరువాత, మీ అర్హత మరియు ఋణదాత మూల్యీకరణ ఆధారంగా వర్తించే వడ్డీ రేటును ఎంటర్ చేయండి
దశ 3: ఒక తిరిగిచెల్లింపు కాలవ్యవధిని ఎంటర్ చేయండి
మీ బడ్జెట్ కు అనుగుణంగా ఉన్న ఒక తిరిగిచెల్లింపు కాలవ్యవధిని ఎంపికచేయండి. ఈఎంఐ ఎలా మారుతుంది అని చూడటానికి మీరు అనేక కాలవ్యవధి ఎంపికలను పరీక్షించవచ్చు.
దశ 4: వివిధ సందర్భాలను పోల్చి చూడండి
-వివిధ కాలవ్యవధి ఎంపికలలో ఈఎంఐ మొత్తాన్ని సమీక్షించండి. ప్రతి తిరిగిచెల్లింపు కాల ప్రభావాన్ని అర్థంచేసుకొనుటకు ఇది మీకు సహాయపడుతుంది.
దశ 5: సౌకర్యవంతంగా ఉండే తిరిగి చెల్లింపు ప్రణాళికను ఎంచుకోండి
-మీ ఇతర ఆర్ధిక బాధ్యతలను నెరవేర్చుకుంటూ మీ ఈఎంఐని సౌకర్యవంతంగా నిర్వహించుకొనే వీలు కలిగించే కాలవ్యవధిని ఎంచుకోండి. ఋణ కాలవ్యవధి మీ ఈఎంఐని ఎలా ప్రభావితం చేస్తుంది. మీరు నేరుగా ఎంచుకునే తిరిగిచెల్లింపు కాలవ్యవధి మీ నెలవారి ఈఎంఐ, ఋణకాలములో మీరు చెల్లించే పూర్తి వడ్డీ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.
| ఋణ కాలవ్యవధి | నెలవారి ఈఎంఐ | చెల్లించదగిన పూర్తి వడ్డీ |
| స్వల్పకాలిక కాలవ్యవధి | ఎక్కువ | తక్కువ |
| మధ్యస్థ కాలవ్యవధి | మధ్యస్థము | మధ్యస్థము |
| సుదీర్ఘ కాలవ్యవధి | తక్కువ | ఎక్కువ |
ఒకవేళ మీరు స్వల్పకాలిక కాలవ్యవధిని ఎంచుకుంటే మీరు ఋణాన్ని త్వరగా తిరిగి చెల్లించవచ్చు. మొత్తం వడ్డీ వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. అయితే, మీ నెలవారి ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు సుదీర్ఘ కాలవ్యవధి ఎంచుకుంటే.. మీరు మీ నెలవారి ఈఎంఐని తద్వారా తిరిగి చెల్లింపు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అయితే, పూర్తి ఋణ కాలవ్యవధిలో మీరు ఎక్కువ వడ్డీ చెల్లించవచ్చు. ఈ ఎంపికలను పోల్చి చూడటానికి, అనువైన తిరిగి చెల్లింపు విధానాన్ని ఎంచుకొనుటకు ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ మీకు వీలు కలిగిస్తుంది.
నెలకు రూ. 90,000 సంపాదిస్తున్న ఒక ఉద్యోగి నేహ ఉదాహరణను చూద్దాము. ఆమె తన ఇంటి పునరుద్ధరణ కోసం రూ. 10 లక్షల ఋణం తీసుకోవాలని, స్థోమతను, తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని సమతుల్యం చేసే కాలవ్యవధిని కనుక్కోవాలని అనుకుంటున్నారు. ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించడం ద్వారా ఆమె ఈ క్రింది ఎంపికలను పోల్చి చూస్తారు
| ఋణ మొత్తము | వడ్డీ రేటు | కాలవ్యవధి | సుమారు ఈఎంఐ |
| రూ. 10 లక్షలు | 12% వార్షికంగా | 3 సంవత్సరాలు | రూ. 33,214 |
| రూ. 10 లక్షలు | 2% వార్షికంగా | 5 సంవత్సరాలు | రూ. 22,244 |
| రూ. 10 లక్షలు | 12% వార్షికంగా | 8 సంవత్సరాలు | రూ. 16,253 |
ఎంపికలను పోల్చి చూసిన తరువాత, నేహ సుదీర్ఘమైన తిరిగిచెల్లింపు కాలవ్యవధి లేకుండా అనుకూలమైన ఈఎంఐని అందిస్తుంది కాబట్టి ఆమె 5-సంవత్సరాల కాలవ్యవధిని ఎంచుకుంటారు. ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించకుండా ఈ విధంగా పోల్చి చూడడం కష్టంగా ఉండేది.
ఒక ఋణ కాలవ్యవధిని ఎంచుకునేటప్పుడు, మీరు ఈ క్రింది ఆర్ధిక బాధ్యతలను పరిగణించాలి.
-మీ మొత్తం ఈఎంఐలు మీ నెలవారి ఆదాయములో 40% నుండి 50% లోపల ఉండాలని సిఫారసు చేయబడుతోంది. దీని వలన మీరు మీ రోజువారి ఖర్చులు, పొదుపు లక్ష్యాలు మరియు అనుకోని ఖర్చులను సౌకర్యవంతంగా కొనసాగించగలరు
-ఒకవేళ ఈఎంఐ మరీ ఎక్కువగా ఉంటే, మీరు దీనిని పరిగణించవచ్చు: దీర్ఘకాలిక కాలవ్యవధి ఎంచుకోవడము తక్కువ మొత్తంలో ఋణం తీసుకోవడం, దరఖాస్తు చేసే ముందు మీ ఆర్ధిక ప్రొఫైల్ ను మెరుగుపరచుకోవడం చేయాలి. ఈ ఎంపికలను వెంటనే పరీక్షించుటకు ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ మీకు సహాయపడుతుంది.
మీ దరఖాస్తును ఆమోదించే ముందు, ఋణదాతలు సాధారణంగా ఋణాన్ని తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు.
-ఆదాయ స్థిరత్వము: నెలవారి తిరిగిచెల్లింపులను మీరు సౌకర్యవంతంగా నిర్వహించగలరా లేదా అని నిర్ణయించుటకు ఋణదాతలు మీ ఆదాయాన్ని సమీక్షిస్తారు
-CIBIL స్కోర్: ఒక మంచి CIBIL స్కోర్ బాధ్యతాయుతమైన మీ క్రెడిట్ ప్రవర్తనను ప్రతిబింబిస్తుందిచ మీ ఋణ ప్రొఫైల్ ను బలోపేతం చేయవచ్చు
-ప్రస్తుత ఆర్ధిక బాధ్యతలు: మీ ప్రస్తుత ఈఎంఐలు, బాకీలు మీ తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి
-ఉపాధి లేదా వ్యాపార సుస్థిరత: ఋణదాతలు మీ ఆర్ధిక సుస్థిరతను అంచనావేయుటకు మీ ఉపాధి చరిత్రను లేదా వ్యాపార ఆదాయాన్ని కూడా సమీక్షించవచ్చు
మీరు పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించి ఒక సౌకర్యవంతమైన ఈఎంఐని గుర్తించిన తరువాత, అనువైన తిరిగి చెల్లింపు ఎంపికలను అందించే ఋణదాతను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ మీ ఈఎంఐని మీ ఆదాయము, ఆర్ధిక లక్ష్యాలతో సమలేఖనం చేయడములో సహాయపడే తిరిగిచెల్లింపు అనుకూలతను అందిస్తుంది
-అనువైన ఋణ మొత్తము: మీ అర్హత ఆధారంగా, మీరు రూ. 40,000 నుండి రూ. 55 లక్షల మధ్య ఋణ మొత్తము కొరకు దరఖాస్తు చేయవచ్చు
-అనువైన తిరిగిచెల్లింపు కాలవ్యవధి: మీరు 12 నెలల నుండి 108 నెలల వరకు ఉండే తిరిగిచెల్లింపు కాలవ్యవధుల నుండి మీ ఆర్ధిక లక్ష్యాలు, తిరిగి చెల్లింపు సామర్థ్యం ఆధారంగా తిరిగిచెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోవచ్చు
-పోటీతత్వ వడ్డీ రేట్లు: మీ అర్హత, క్రెడిట్ మూల్యీకరణ ఆధారంగా వార్షికంగా 10% నుండి 30% వరకు ఉండే వడ్డీ రేట్లు ఉంటాయి
-త్వరిత ఆమోదం, పంపిణీ: అర్హులైన దరఖాస్తుదారులు త్వరిత ఆమోదం, 24 గంటలలోపు పంపిణీని అందుకోవచ్చు
-తాకట్టు అవసరం లేదు: ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయటానికి మీరు ఎలాంటి ఆస్తిని పూచీకత్తుగా పెట్టాల్సిన పనిలేదు
-నామమాత్రపు డాక్యుమెంటేషన్: దరఖాస్తు ప్రక్రియకు కేవలం ప్రాథమిక డాక్యుమెంటేషన్ అవసరం ఉంటుంది. ఇది మొత్తం ప్రక్రియను త్వరితంగా మరియు సౌకర్యవంతంగా పూర్తి చేయటానికి సహాయపడుతుంది
మీరు ఈ క్రింది ప్రమాణాలను నెరవేరిస్తే మీరు దరఖాస్తు చేయటానికి అర్హులు అవుతారు
-పరామితి ఆవశ్యకత
-జాతీయత భారతీయులు
-వయసు 21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు
-ఉద్యోగం ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగము, లేదా ఎంఎన్‌సి ఉద్యోగి
-CIBIL స్కోర్ 650 లేదా ఆపైన
-వినియోగదారుడి ప్రొఫైల్ వేతన ఉద్యోగి లేదా స్వయం-ఉపాధి పొందినవారు-
-మీ ఆర్ధిక వివరాలు మరియు ఋణదాత మూల్యీకరణ ఆధారంగా అర్హత మారవచ్చు
ఆన్లైన్ లో దరఖాస్తు చేయటానికి ఈ క్రింది సులభమైన దశలను అనుసరించండి
-బజాజ్ ఫైనాన్స్ వెబ్సైట్ సందర్శించండి మరియు పర్సనల్ లోన్ పేజ్ కు వెళ్ళండి
-కావలసిన ఋణ మొత్తాన్ని మరియు అనుకూలమైన కాలవ్యవధిని ఎంటర్ చేయండి
-“చెక్ లోన్ ఆఫర్” పై క్లిక్ చేయండి
-మీ వ్యక్తిగత, ఆర్ధిక, ఉపాధి వివరాలను అందించండి
-అందుబాటులో ఉన్న ఋణ ఆఫర్ ను సమీక్షించండి
-మీ కేవైసి ధృవీకరణను పూర్తి చేయండి
-మీ బ్యాంక్ ఖాతా వివరాలను ధృవీకరించండి
-మీ దరఖాస్తును సబ్మిట్ చేయండి
-ఒక ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు. మిగిలిన దశల గురించి మార్గదర్శనం చేస్తారు
-తిరిగిచెల్లింపులను అంచనావేయుటకు ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించారు
-అనేక కాలవ్యవధి ఎంపికలను పోల్చి చూశారు
-మీ నెలవారి తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేశారు
-మీ CIBIL స్కోర్ ను సమీక్షించారు
-ప్రస్తుత ఈఎంఐలు, ఆర్ధిక బాధ్యతలను పరిగణించారు
-కావలసిన దస్తావేజులను సిద్ధం చేసుకున్నారు
-మీకు కావలసినంత మొత్తం మాత్రమే అప్పు తీసుకున్నారు
-మీ బడ్జెట్ లో సరిగ్గా ఇమిడిపోయే కాలవ్యవధిని ఎంచుకోండి
ఒక పర్సనల్ లోన్ మీ ప్రణాళికలను ఆలస్యం చేయకుండా ముఖ్యమైన ఆర్ధిక అవసరాలను నెరవేర్చుకొనుటకు సహాయపడుతుంది. అయితే, ఋణ మొత్తము ఎంచుకోవడము మాదిరిగానే సరైన తిరిగిచెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోవడం కూడా ముఖ్యమైనదే. తిరిగిచెల్లింపు ఎంపికలను పోల్చి చూడటానికి, నెలవారి వాయిదాలను అంచనా వేయుటకు, మీ బడ్జెట్ కు సరిపోయే ఒక కాలవ్యవధిని గుర్తించుటకు ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ సహాయపడుతుంది. ముందుగానే మీ ఈఎంఐని ప్రణాళిక చేసుకోవడం ద్వారా మీరు మరింత విశ్వాసముతో అప్పు తీసుకోవచ్చు. అనవసరమైన ఆర్ధిక ఒత్తిడిని తప్పించుకోవచ్చు. రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు ఉండే ఋణ మొత్తాలు, 12 నెలల నుండి 108 నెలల వరకు ఉండే తిరిగిచెల్లింపు కాలవ్యవధులు, త్వరిత ఆమోదము, 24 గంటలలోపు పంపిణీ, తాకట్టు అవసరం లేకపోవడం, నామమాత్రపు డాక్యుమెంటేషన్ తో, బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ మీ ఆర్ధిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే ఒక తిరిగిచెల్లింపు ప్రణాళికను ఎంచుకునే అనుకూలతను ఇస్తుంది. ఇంకా వేచి ఉండడం ఎందుకు? ఇప్పుడే దరఖాస్తు చేయండి.