తాగేందుకు డబ్బులు తక్కువైయ్యాయని కన్న కూతుర్నే తాకట్టు… తండ్రి కర్కశత్వం… విజయవాడలో అమానవీయ ఘటన…

మద్యం కోసం ప్రాణాల్ని తీసిన దారుణాల్ని చూశాం… విజయవాడ వన్ టౌన్లో చోటు చేసుకున్న ఘటన మత్తు కోసం మమకారాన్ని అంగడి సరుకుగా మార్చి దుర్ఘటన…

  • Rajeev Rayala
  • Publish Date - 7:56 pm, Tue, 1 December 20

మద్యం మనిషిని మృగాన్ని చేసిన దుర్ఘటనలు చూశాం… మత్తులో మమకారాన్ని మరిచి మానభంగాలకు తెగబడిన దుశ్చర్యాల్ని చూశాం… మద్యం కోసం ప్రాణాల్ని తీసిన దారుణాల్ని చూశాం… ఆయా ఘటనల్లో బలైన అనుబంధాలెన్నో అన్నాయి. అయితే, తాజాగా విజయవాడ వన్ టౌన్లో చోటు చేసుకున్న ఘటన మత్తు కోసం మమకారాన్ని అంగడి సరుకుగా మార్చి… పేగు బంధానికి మచ్చతెచ్చి… మానవీయతను మంటగొల్పే ఘటనే… తాగేందుకు డబ్బులు తక్కువైయ్యాయని కన్న కూతుర్నే తాకట్టుపెట్టాడో కసాయి తండ్రి.

 

మహారాష్ర్ట నాందేడ్కు చెందిన సతీష్ విజయవాడ టౌన్లో డిసెంబర్ 1న మద్యం తాగేందుకు ఓ బార్కు వెళ్లాడు. అక్కడ మందుకు డబ్బులు తక్కువైయ్యాయని కన్న కూతురిని బార్ సిబ్బంది వద్ద తాకట్టు పెట్టాడు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు మమకారం మరిచిన కసాయి తండ్రిని అదులోకి తీసుకున్నారు. అనంతరం సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చి వొదిలేశారు. చిన్నారిని తల్లికి అప్పగించారు.