విషాదం: కూతురి మరణవార్త విని కుప్పకూలిన తండ్రి

నాన్నకు కొడుకుల మీదకంటే..కూతురి మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుందని అంటారు. అలాగే, కూతురికి కూడా అమ్మకంటే నాన్నంటేనే ఇష్టమని చెబుతుంటారు. అందుకు సాక్ష్యంగా నిలిచింది కడప జిల్లాలో చోటు చేసుకున్న ఓ విషాద సంఘటన.

విషాదం: కూతురి మరణవార్త విని కుప్పకూలిన తండ్రి
Follow us

|

Updated on: Jul 27, 2020 | 2:04 PM

నాన్నకు కొడుకుల మీదకంటే..కూతురి మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుందని అంటారు. అలాగే, కూతురికి కూడా అమ్మకంటే నాన్నంటేనే ఇష్టమని చెబుతుంటారు. అందుకు సాక్ష్యంగా నిలిచింది కడప జిల్లాలో చోటు చేసుకున్న ఓ విషాద సంఘటన. కూతురి మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి గుండె ఆగిపోయింది. ఒకేసారి సంభవించిన ఆ తండ్రి కూతురి మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది.

కడప జిల్లా రాయచోటికి చెందిన సుభాన్ వ్యక్తికి భార్య ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా, సుభాన్ ముగ్గురు కూతుళ్లలో ఓ కుమార్తె ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. కూతురికి ఆరోగ్యం సరిగా లేకపోడంతో ఆ తండ్రి మనసు తల్లడిల్లింది..కూతురి ఆరోగ్య పరిస్థితిని చూసి రోజురోజుకూ మానసికంగా భాదపడుతూ కుంగిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతన్ని కూడా కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇదిలా ఉండగానే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సుభాన్ కూతురు కన్నుమూసింది. ఆ విషయం తెలియగానే సుభాన్‌కు గుండెపోటు రావటంతో ఆస్పత్రిలోనే కన్నుమూశారు. ఒకే ఇంట్లో తండ్రి, కుమార్తె మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.