కూతురితో పాటు తండ్రి.. టెన్త్ ఎగ్జామ్ పాస్

తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పదోతరగతి పరీక్షా ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో ఒకే కుటుంబంలో ఇద్దరు పాసయ్యారు. అయితే వారిద్దరు తండ్రీ కూతుళ్లు కావడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. పుదుచ్చేరికి చెందిన సుబ్రమణియన్ పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్‌లో ఫీల్డ్ ఇన్ఫెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఏడోతరగతి సర్టిఫికేట్‌తో కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఈ ఉద్యోగాన్ని సంపాదించారు. ఆ తరువాత ప్రమోషన్ కోసం 2017సంవత్సరంలో ప్రైవేట్‌గా ఎనిమిదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యాడు. అంతటితో ఆగకుండా 2018లో పదోతరగతి పరీక్షలకు […]

కూతురితో పాటు తండ్రి.. టెన్త్ ఎగ్జామ్ పాస్
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2019 | 4:52 PM

తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పదోతరగతి పరీక్షా ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో ఒకే కుటుంబంలో ఇద్దరు పాసయ్యారు. అయితే వారిద్దరు తండ్రీ కూతుళ్లు కావడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే.. పుదుచ్చేరికి చెందిన సుబ్రమణియన్ పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్‌లో ఫీల్డ్ ఇన్ఫెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఏడోతరగతి సర్టిఫికేట్‌తో కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఈ ఉద్యోగాన్ని సంపాదించారు. ఆ తరువాత ప్రమోషన్ కోసం 2017సంవత్సరంలో ప్రైవేట్‌గా ఎనిమిదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యాడు. అంతటితో ఆగకుండా 2018లో పదోతరగతి పరీక్షలకు కూడా హాజరయ్యాడు. అయితే ఆ సంవత్సరం ఫలితాల్లో సుబ్రమణ్యం మూడు పరీక్షలలో తప్పగా.. సప్లిమెంటరీ రాసినా.. అవి క్లియర్ అవ్వలేదు. దీంతో ఈ ఏడాది మళ్లీ పరీక్షలు రాసి ఎలాగైతేనేం పాసయ్యాడు. కాగా ఆయన కుమార్తె తిరిగున కూడా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణురాలయ్యింది. దీంతో సుబ్రమణ్యం కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.