కన్నీళ్లు పెట్టిస్తోన్న ఫోటో!..మరణం కూడా వేరుచేయలేని బంధం

నిరంతరం గ్యాంగ్‌ వార్‌లతో దద్దరిల్లే తన దేశం ఎల్ సాల్విడార్ నుంచి అమెరికాకు వెళ్లి.. అక్కడే స్థిరపడాలనుకున్నాడు. నిత్యం గ్యాంగ్ వార్‌లు హత్యలు, అత్యాచారాలుతో అట్టుడికే తన దేశంలో ఉండలేక.. ప్రాణాలకు తెగించైనా సరే అగ్రరాజ్యంలో ప్రవేశించాలనుకున్నాడు. కొంత డబ్బు సంపాదించి తిరిగి ఇంటికి రావొచ్చు అనుకున్నాడు. కానీ అదే తన పాలిట శాపమవుతుందని ఊహించలేకపోయాడు ఓ మధ్యతరగతి వ్యక్తి. అతడి పేరు ఆస్కార్‌ ఆల్బెర్టో మార్జినెజ్‌ రామిరెజ్‌. ఈఐ సాల్వేడార్‌కు చెందిన అతడు అమెరికాలో ఆశ్రయం […]

కన్నీళ్లు పెట్టిస్తోన్న ఫోటో!..మరణం కూడా వేరుచేయలేని బంధం
Follow us

|

Updated on: Jun 27, 2019 | 4:31 AM

నిరంతరం గ్యాంగ్‌ వార్‌లతో దద్దరిల్లే తన దేశం ఎల్ సాల్విడార్ నుంచి అమెరికాకు వెళ్లి.. అక్కడే స్థిరపడాలనుకున్నాడు. నిత్యం గ్యాంగ్ వార్‌లు హత్యలు, అత్యాచారాలుతో అట్టుడికే తన దేశంలో ఉండలేక.. ప్రాణాలకు తెగించైనా సరే అగ్రరాజ్యంలో ప్రవేశించాలనుకున్నాడు. కొంత డబ్బు సంపాదించి తిరిగి ఇంటికి రావొచ్చు అనుకున్నాడు. కానీ అదే తన పాలిట శాపమవుతుందని ఊహించలేకపోయాడు ఓ మధ్యతరగతి వ్యక్తి. అతడి పేరు ఆస్కార్‌ ఆల్బెర్టో మార్జినెజ్‌ రామిరెజ్‌. ఈఐ సాల్వేడార్‌కు చెందిన అతడు అమెరికాలో ఆశ్రయం పొందాలని భావించాడు. ఇందులో భాగంగా పలుమార్లు ఆ దేశ అధికారులకు తన పరిస్థితి గురించి మొరపెట్టుకున్నాడు. అయినప్పటికీ అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మెక్సికో గుండా అమెరికాలో ప్రవేశించాలని భావించాడు.

ఈ క్రమంలో ఆదివారం తన భార్యపిల్లలతో కలిసి అమెరికా- మెక్సికో సరిహద్దులో ఉన్న రియో గ్రాండే నదిని దాటేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా మొదట కూతురిని వీపునకు కట్టుకుని ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చాడు. అనంతరం తన భార్యను కూడా తీసుకువచ్చేందుకు వెనుదిరిగాడు. అయితే తండ్రి తనను విడిచిపెట్టి వెళ్తున్నాడని భావించిన చిన్నారి వాలెరియా.. అతడిని అనుసరించాలని నీళ్లలో దూకింది. దీంతో షాక్‌కు గురైన రోమిరెజ్‌ వెంటనే వెనక్కి వచ్చి కూతురిని తన షర్టుకు ముడివేసుకున్నాడు. కూతురి చేతులు మెడ చుట్టూ వేసుకుని మళ్లీ ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తూ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వారిద్దరు నీళ్లలో మునిగి చనిపోయారు. అనంతరం అలాగే ఒడ్డుకు కొట్టుకువచ్చారు. హృదయవిదారకంగా ఉన్న తండ్రీ కూతుళ్ల ఈ ఫొటోను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు. మెక్సికోలో నివసించే జర్నలిస్టు జులియా లీ డ్యూక్‌ ఈ ఫొటోను తీశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో సిరియా శరణార్థి చిన్నారి అలన్‌ కుర్దీ రూపాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ శరణార్థుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.