Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 8 లక్షల 78 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 878254. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 301609. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 553471. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23174. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • భవిష్యవాణి లో స్వర్ణలత. భక్తులు 5వారాల పాటు శాఖ పోయాలి. పప్పు బెల్లాలతో ప్రతి గడప నుండి నాకు పూజ చేయాలి. నాకు ఈ ఏడు సంతోశమ్ లేదు. ఎవరు చేసుకుంది వారు అనుభవించాల్సిందే. నా ప్రజలని నేను కాపాడత.
  • తూర్పుగోదావరి జిల్లా : జగ్గంపేట నియోజకవర్గం కాపుసోదరులకు మాజీ మంత్రి ముద్రగడ బహిరంగ లేఖ. కాపు ఉద్యమం నుండి తప్పుకోవాలని నిర్ణయించు కొన్నా.. ముద్రగడ . ఇటీవల కొంతమంది సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ల నాపై దాడులు చేస్తున్నారు... ముద్రగడ . నన్ను కులద్రోహి గజదొంగ వంటి మాటలతో విమర్శిస్తున్నారు.. ముద్రగడ . నేను ఉద్యమం లో వసూలు చేసిననిధులు వారికి పంచలేదనా ఆ దాడులు... ముద్రగడ .
  • కరోనా వైరస్ నేపద్యంలో జైల్ లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టు లో పిల్ . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైల్లో ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలంటూ పిల్ లో పేర్కొన్న పిటిషనర్ లింగయ్య . ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెరోల్ పై విడుదల చేస్తున్నారని, తెలంగాణలో కూడా విడుదల చేసేలా . ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న పిటిషనర్ . మరి కొద్ది సేపటిలో విచారణ చేయున్న హైకోర్టు.
  • గాంధీలో నాలుగో రోజు కొనసాగుతున్న నర్సుల సమ్మె. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చలతో ఏకీభవించని నర్సులు. విధులు బహిష్కరించిన 200 మంది నర్సులు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా హెడ్ నర్స్ పదోన్నతి పై మండిపాటు.
  • బాలీవుడ్‌లో మరో విషాదం. ముంబై: బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ (29) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆదివారం తుది శ్వాస విడిచారు. దివ్య అకాల మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

గుడ్ న్యూస్..ఫాస్ట్‌ట్యాగ్ పనిచెయ్యకపోతే మీ ట్రిప్ ఉచితం..

If The FASTag For Your Car Is Not Read by Scanners at Toll Plazas Your Trip is Free, గుడ్ న్యూస్..ఫాస్ట్‌ట్యాగ్ పనిచెయ్యకపోతే మీ ట్రిప్ ఉచితం..

సంక్రాంతి పండుగకు పట్నం ఊరెళ్లింది. ట్రైన్‌కి వెళ్లినవాళ్ల సంగతి తెలీదుగానీ, రోడ్డు మార్గాన వెళ్లినవారు ట్రాఫిక్‌కి వల్ల చుక్కలు చూశారు. టోల్‌గేట్స్‌ వద్దే గంటలు, గంటలు సమయం వెచ్చించాల్సి వచ్చింది. మరోవైపు ఫాస్ట్‌ట్యాగ్ సరిగ్గా రీడ్ కాక వాహనదారులు తెగ తిప్పలు పడ్డారు. ఇక జనవరి 15 తర్వాత జాతీయ రహదారులపై ప్రయాణించాలి అంటే తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ ఉండాల్సిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫాస్ట్‌ట్యాగ్‌ను నమ్ముకుంటే టెక్నికల్ సమస్యల వల్ల ప్రయాణం తలకు మించిన భారమవుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ ప్లాజాలో ఫాస్ట్‌ట్యాగ్ యంత్రాలు పనిచేయని పక్షంలో ఉచితంగానే వెళ్లిపోవచ్చు. ఈ మేరకు రూల్స్ సవరించింది ఎన్‌హెచ్‌ఏఐ. అయితే మీ వెహికల్ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో బ్యాలెన్స్ ఉండాలి. అది సక్రమంగా పనిచేస్తూ ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే ఫ్రీ ట్రిప్‌కి అనుమతి ఉంటుంది.

 క్యూలో ఆగిపోకుండా ప్రయాణికులు సమయాన్ని ఫాస్ట్ ట్యాగ్ కాపాడుతుంది. అంతేకాదు టోల్ దాటిన ప్రతి వాహనం స్కాన్ చేయబడటం చేత క్రైమ్స్ విషయంలో కూడా నేరస్థులను పట్టుకోవడం సులభతరం అవుతుంది. ఇక ఫాస్ట్ ట్యాగ్‌లు 22 సర్టిఫైడ్ బ్యాంకుల ద్వారా పొందవచ్చు. టోల్‌ప్లాజాల్లోనూ తీసుకునే సదుపాయం ఉంది.  ఇటీవల వాటిని అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులోకి తెచ్చారు. కస్టమర్లకు ఫాస్ట్ ట్యాగ్ సులభతరం చేయడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యుపిఐ) కార్డులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు జారీ చేసిన ప్రీ-పెయిడ్ కార్డుల ద్వారా కూడా టోల్ చెల్లింపులు జరపొచ్చని తెలిపింది. కాగా ఇప్పటికే 1.10 కోట్ల ఫాస్ట్‌యాగ్‌లు జారీ చేయబడినట్లు ఎన్‌హెచ్‌ఏఐ నుంచి సమాచారం అందుతోంది. 

Related Tags