పాక్ తో యుద్ధం జరుగుతుందని ముందే తెలుసు : జమ్ముకశ్మీర్ మాజీ సీఎం

శ్రీనగర్:జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చే ముందు పాక్ తో చిన్నపాటి యుద్ధ వాతావరణం ఉంటుందని.. తాను ముందే ఊహించినట్లు అన్నారు. అంతేకాదు ఈ సర్జికల్ స్ట్రైక్స్ కూడా ఎన్నికల నేపథ్యంలో జరిగాయని అన్నారు. అయితే ఈ ఉద్రిక్తతల కారణంగా మనం కోట్ల విలువ చేసే ఎయిర్‌క్రాఫ్ట్‌ను కోల్పోయామని అన్నారు. కనీసం పైలట్ అయినా సురక్షితంగా పాకిస్థాన్ నుంచి బయటపడ్డాడని.. ఇది సంతోషించాల్సిన విషయమని […]

పాక్ తో యుద్ధం జరుగుతుందని ముందే తెలుసు : జమ్ముకశ్మీర్ మాజీ సీఎం
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 3:05 PM

శ్రీనగర్:జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చే ముందు పాక్ తో చిన్నపాటి యుద్ధ వాతావరణం ఉంటుందని.. తాను ముందే ఊహించినట్లు అన్నారు. అంతేకాదు ఈ సర్జికల్ స్ట్రైక్స్ కూడా ఎన్నికల నేపథ్యంలో జరిగాయని అన్నారు. అయితే ఈ ఉద్రిక్తతల కారణంగా మనం కోట్ల విలువ చేసే ఎయిర్‌క్రాఫ్ట్‌ను కోల్పోయామని అన్నారు. కనీసం పైలట్ అయినా సురక్షితంగా పాకిస్థాన్ నుంచి బయటపడ్డాడని.. ఇది సంతోషించాల్సిన విషయమని ఫరూక్ అబ్ధుల్లా అన్నారు.