ఏడు నెలల నిర్బంధం తరువాత.. తండ్రీ కొడుకుల భేటీ

ఏడు నెలల నిర్బంధం అనంతరం జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం జైలు నుంచి రిలీజయ్యారు.

ఏడు నెలల నిర్బంధం తరువాత.. తండ్రీ కొడుకుల భేటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 14, 2020 | 4:11 PM

ఏడు నెలల నిర్బంధం అనంతరం జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం జైలు నుంచి రిలీజయ్యారు.  పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద ఆయన ఇంతకాలం నిర్బంధంలో ఉన్నారు. శ్రీనగర్ లోని జైల్లో తనను కలుసుకోవడానికి వఛ్చిన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను చూసి ఆయన ఉద్వేగానికి గురయ్యారు. అటు తన తండ్రిని చూసిన ఒమర్ సైతం ఆనంద భాష్పాలతో ఆయనను హగ్ చేసుకున్నారు. ఒమర్  కూడా నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. శ్రీనగర్లోని తన తండ్రి, మాజీ సీఎం షేక్ అబ్దుల్లా సమాధిని ఫరూక్ అబ్దుల్లా తన భార్య, మనుమడితో కలిసి సందర్శించి అక్కడ ప్రార్థనలు చేశారు. తన యోగక్షేమాలపై ఆందోళన వ్యక్తం చేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ.. స్వేఛ్చ ఇంకా పరిసమాప్తం కాలేదని, ఇంకా జైల్లో మగ్గుతున్న ఒమర్, మెహబూబా ముఫ్టీ వంటి రాజకీయ నేతలు విడుదల కావలసి ఉందని అన్నారు. ప్రభుత్వం త్వరలో ఇందుకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు.

జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన అధికరణం 370 ని రద్దు చేయాలని కేంద్రం గతఆగస్టు 5 న నిర్ణయం తీసుకోవడానికి ముందు ఈ నేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు. సాధారణంగా వేర్పాటువాదులు, టెర్రరిస్టులపై ప్రయోగించే ప్రజా భద్రతా చట్టాన్ని కేంద్రం మొదటిసారిగా రాజకీయ నేతలపై ప్రయోగించడం విశేషం. ఈ చట్టం కిందఒకరిని విచారణ లేకుండా మూడు నెలల పాటు డిటెన్షన్ లో ఉంచవచ్చు. ఈ శిక్షాకాలాన్ని ఎన్నోసార్లు పొడిగించవచ్చు.

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?