రైతన్నకు శుభవార్త… పావలా వడ్డీకే రూ.3 లక్షల రుణం !

దేశానికి వెన్నెముక రైతన్న…అందుకే అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి మన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు. అందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ నిధి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి… రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి. తాజాగా మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం కలిగించే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాధారణంగా బ్యాంకులు ఉద్యోగులు, వ్యాపారులకు క్రెడిట్‌కార్డులు అందజేస్తాయి. రైతులకు భరోసా కల్పించేందుకు కిసాన్‌ క్రెడిట్‌కార్డు పథకానికి శ్రీకారం చుట్టింది […]

రైతన్నకు శుభవార్త... పావలా వడ్డీకే రూ.3 లక్షల రుణం !
Follow us

|

Updated on: Mar 02, 2020 | 1:59 PM

దేశానికి వెన్నెముక రైతన్న…అందుకే అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి మన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు. అందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ నిధి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి… రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి. తాజాగా మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం కలిగించే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాధారణంగా బ్యాంకులు ఉద్యోగులు, వ్యాపారులకు క్రెడిట్‌కార్డులు అందజేస్తాయి. రైతులకు భరోసా కల్పించేందుకు కిసాన్‌ క్రెడిట్‌కార్డు పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ కార్డులను రైతులకు మాత్రమే అందిస్తాయి. ఈ కార్డుల ద్వారా తక్కువ వడ్డీకే రైతులకు బ్యాంకులు రుణాలు అందజేయనున్నాయి.

అధిక వడ్డీల భారం నుండి అన్నదాతకు విముక్తి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను తెరమీదకు తెచ్చింది. ఎరువులు, విత్తనాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందే ప్రతి ఒక్క రైతుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు అందించాలని భావిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అది కూడా రైతులు గతంలో తీసుకున్న రుణాలను గడువులోపు కడితేనే ఇది వర్తిస్తుంది.

కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులు ఎలాంటి తనఖా లేకుండానే రూ1.6 లక్షల వరకు రుణం పొందొచ్చు. బ్యాంకులు రుణాలపై సాధారణ వడ్డీనే వసూలు చేస్తాయి. ఒకవేళ రైతులు తీసుకున్న రుణాన్ని చెల్లించకపోతే అప్పుడు కాంపౌండింగ్ వడ్డీ పడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద సులభంగా రుణాలు తీసుకోవడమే కాకుండా మరో బెనిఫిట్ కూడా పొందొచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణంతో పంటకు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కవరేజ్ కూడా లభిస్తుంది. కేసీసీ అకౌంట్‌‌లోని డబ్బులకు సేవింగ్స్ వడ్డీ రేటు వర్తిస్తుంది.

కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం బ్యాంకులకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలను అందిస్తోంది. మీరు ఎస్‌బీఐకి వెళ్లి కూడా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే…https://www.pmkisan.gov.in/ లింక్‌పై క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని… అది ఫిల్ చేసి.. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను జతచేసి బ్యాంక్‌కు వెళ్లి సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.