రైతులకు అండగా మేం: జగన్

CM YS Jagan Mohan Reddy, రైతులకు అండగా మేం: జగన్

సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 2019-20 రాష్ట్ర రుణ ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. ఈ సంరద్భంగా రాబోయే సంవత్సరంలో 2,29,200కోట్ల రూపాయల రుణ ప్రణాళిక ప్రతిపాదనలను బ్యాంకర్లు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే 2019-20లో లక్షా 15వేల కోట్లు వ్యవసాయానికి ఇవ్వాలని సంకల్పిస్తున్నామని తమ లక్ష్యాన్ని ముందుంచారు.

అనంతరం జగన్ వారితో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు చేతులు చాచే పరిస్థితి ఉండకూడదని, సంక్షోభంలో ఉన్న సమయాల్లో ఆదుకోవాల్సింది మనమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1.25 ఎకరాల కన్నా తక్కువ పొలం ఉన్న రైతులు సుమారు 50శాతం ఉన్నారని.. పంటకు పెట్టుబడి పెట్టే పరిస్థితి వారికి లేదని సీఎం వివరించారు. రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకు రూ.12,500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని.. ఈ మొత్తాన్ని ఉన్న అప్పులకు జమచేసే వీలే ఉండకూడదని చెప్పారు. భూ యజమానుల హక్కులు కాపాడుతూనే, కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *