Farmers Protest: మరో కీలక నిర్ణయం తీసుకున్న రైతులు.. బడ్జెట్ రోజున పార్లమెంట్‌కు మహా పాదయాత్ర

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు రెండు నెలలకు పైగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Farmers Protest: మరో కీలక నిర్ణయం తీసుకున్న రైతులు.. బడ్జెట్ రోజున పార్లమెంట్‌కు మహా పాదయాత్ర
Follow us

|

Updated on: Jan 25, 2021 | 7:34 PM

Farmers Protest LIVE Updates: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు రెండు నెలలకు పైగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతులు ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం 18 నెలల పాటు తాత్కాలికంగా నిలిపేస్తామని ప్రతిపాదించింది. అయినప్పటికీ.. ఈ ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. రేపు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజధాని ఢిల్లీలో వేలాది ట్రాక్టర్లతో పరేడ్‌ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే రైతు సంఘాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫిబ్రవరి 1న ఢిల్లీలోని పలు ప్రాంతాల నుంచి పార్లమెంట్‌ వరకు మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించాయి.

ఢిల్లీలోని పలు ప్రాంతాల నుంచి పార్లమెంట్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు క్రాంతికారి కిసాన్ యూనియన్ అధినేత దర్శన్ పాల్ సోమవారం సాయంత్రం వెల్లడించారు. ఇదిలాఉంటే.. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ తరుణంలోనే రైతులు పార్లమెంట్‌కు పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించి కేంద్రాన్ని ఇరకాటంలో పడేశారు. రేపు రైతులు రిపబ్లిక్ పరేడ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!