రైతు చర్చల్లో పురోగతి.. వ్యవసాయ చట్టాలపై రైతులముందు కొత్త ప్రతిపాదన.. సమస్య పరిష్కారానికి మరో కమిటీ

ఏడాదిన్నర వరకు కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తామని రైతులకు హామీ ఇచ్చింది.

రైతు చర్చల్లో పురోగతి.. వ్యవసాయ చట్టాలపై రైతులముందు కొత్త ప్రతిపాదన.. సమస్య పరిష్కారానికి మరో కమిటీ
Follow us

|

Updated on: Jan 20, 2021 | 8:59 PM

కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చల్లో పురోగతి లభించింది. కేంద్రం రైతు సంఘాల ముందు ఓ ప్రతిపాదన పెట్టింది. కేంద్రం కాస్త మెట్టుదిగింది. ఏడాదిన్నర వరకు కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులతో కమిటీ వేస్తామని.. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కేంద్రం ప్రతిపాదనపై ఎల్లుండి జరిగి చర్చల్లో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు.

రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు ఇవాళ ఢిల్లీలో సమావేశమయ్యారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టాలపై ముందుకెళ్తామని ప్రకటించింది. చట్టాలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ కూడా దాఖలు చేస్తామని హామీ ఇచ్చింది. కనీస మద్దతుధరపై కమిటీ వేస్తామని ఆఫర్‌ ఇచ్చింది. కేంద్రం ప్రతిపాదన రేపు చర్చిస్తామని రైతు సంఘాలు తెలిపాయి. ఎల్లుండి జరిగే చర్చల్లో తమ అభిప్రాయాన్ని కేంద్రానికి వెల్లడిస్తామని తెలిపాయి. ఈనెల 22వ తేదీన కచ్చితంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు.

రైతులతో కేంద్రం 10 సార్లు సమావేశమయ్యింది. కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌ , పీయూష్‌ గోయెల్‌ చర్చల్లో పాల్గొన్నారు. మరోవైపు రిపబ్లిక్‌డే నాడు ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ర్యాలీకి అనుమతిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Read Also… కొత్త బడ్జెట్‌పై కోటి ఆశలు.. సామాన్యుడి సొంతింటి కల నెరవేరేనా..? నిరుద్యోగులకు ఉపశమనం దొరికేనా..?

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే