ఆనందంలో ఉల్లి రైతులు: ధరలు పైపైకి..!

Farmers overjoyed as onion prices shoot up in Kurnool, ఆనందంలో ఉల్లి రైతులు: ధరలు పైపైకి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో.. క్వింటాకు గరిష్టంగా రూ.4 వేలు పలికిన ఉల్లి ధరలు. పెరిగిన ఈ ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏపీలో ధర ఎక్కువ ఉండటంతో.. తెలంగాణ రైతులు కూడా అక్కడికి వెళ్లే పంటను అమ్మేస్తున్నారు. గత రెండేళ్ల నష్టాల నుంచి గట్టెక్కిన ఉల్లి రైతులు. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా.. తగ్గిన ఉల్లిసాగు.. దీంతో.. రిటైల్ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో.. ధరలు ఆకాశానికెక్కుతున్నాయి. గత రెండేళ్లుగా నష్టపోయామని.. ఇప్పుడు పెరిగిన ధరలతో ఆనందంగా ఉందంటూ.. రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు రూ.40 నుంచి 50లకు అమ్ముడుపోతున్నాయి. రెండు, మూడు రోజుల క్రితం వరకు హైదరాబాద్ మార్కెట్‌లో క్వింటాలుకు రెండు వేల వరకు పలికిన ధర నిన్న మూడు వేలకు పెరిగింది. గతేడాదితో పోలిస్తే మార్కెట్‌లకు 4 నుంచి 5 వేల క్వింటాళ్ల మేర సరఫరా తగ్గిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *