Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

ప్రజలకు షాక్.. మరింత పెరగనున్న ఉల్లి ధరలు..!

Farmers overjoyed as Onion prices shoot up, ప్రజలకు షాక్.. మరింత పెరగనున్న ఉల్లి ధరలు..!

మార్కెట్లో ఉల్లిధరలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. ఏకంగా క్వింటాల్ ఉల్లి ధర రూ.6,700కి పలికింది. పెరిగిన ధరలతో.. ఉల్లి రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. వినియోగదారులు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు రూ.10 వేల వరకూ పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో ఉల్లి ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో.. కర్నూలు ఉల్లికి.. రికార్డు స్థాయి ధర వస్తోంది.

గతేడాది ఇదే సమయంలో.. క్వింటాల్ ఉల్లి ధర 100 రూపాయలే పలికింది. అయితే.. ఈ ఏడాది పరిస్థితులు మారిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లిని రూ.6 వేలకు పైగానే.. దళారులు కొనుగోలు చేయడంతో  రైతుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి.

మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో పండించే ఉల్లి దేశీయ మార్కెట్‌తో పాటు.. విదేశీ మార్కెట్‌లోనూ.. ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఆగష్టు నుండి అక్టోబర్ వరకూ.. వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట దెబ్బతింది. ఈ ప్రభావంతో ఉల్లి పాయల ధర దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. కానీ.. రైతులకు మాత్రం లాభం చేకూరింది. మొత్తానికి ఈ ఏడాది ఉల్లి.. రైతులకు సిరులు కురిపిస్తోంది. దిగుబడి తక్కువైనా.. ధర ఉండటంతో.. పండిన పంటతో గిట్టుబాటు అయ్యిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తోన్నారు.

ఒకవైపు ఉల్లిపాయల రేటు ఎక్కువయి.. జనాలు కన్నీరు కారుస్తుంటే.. మార్కెట్లో మంచి ధర పలకడంతో రైతులకు కాసుల వర్షం కురుస్తోంది.