ఢిల్లీలో ఆంధ్రా ఉల్లి రైతుల లొల్లి

దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర ఉల్లి రైతులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎగుమతులపై నిషేధం కారణంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ చేరుకున్న కృష్ణాపురం (కేపీ) ఉల్లి పండించే రైతులు.. ఎగుమతులపై నిషేధం ఎత్తివేసి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఘాటుగా ఉండే కేపీ ఉల్లిని స్థానికంగా ఎవరూ వినియోగించరని, దాంతో వాటిని సింగపూర్, మలేషియా, హాంకాంగ్, శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతి చేస్తామని రైతులు తెలిపారు. ఎగుమతి ద్వారా టన్నుకు లక్ష […]

ఢిల్లీలో ఆంధ్రా ఉల్లి రైతుల లొల్లి
Follow us

|

Updated on: Jan 18, 2020 | 4:10 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర ఉల్లి రైతులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎగుమతులపై నిషేధం కారణంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ చేరుకున్న కృష్ణాపురం (కేపీ) ఉల్లి పండించే రైతులు.. ఎగుమతులపై నిషేధం ఎత్తివేసి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఘాటుగా ఉండే కేపీ ఉల్లిని స్థానికంగా ఎవరూ వినియోగించరని, దాంతో వాటిని సింగపూర్, మలేషియా, హాంకాంగ్, శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతి చేస్తామని రైతులు తెలిపారు. ఎగుమతి ద్వారా టన్నుకు లక్ష రూపాయలు వస్తుండేది.. కానీ ప్రస్తుతం ఎగుమతిపై బ్యాన్ కారణంగా పంట పూర్తిగా వృధా అవుతోందని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కేపీ ఉల్లిని ఎక్కువగా పండిస్తారని, ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేల ఎకరాల్లో కేపీ ఉల్లి పంట సాగైందని రైతులంటున్నారు. తక్కువ వర్షపాతం ఉన్న ఎర్ర నేలపై ఈ పంట బాగా పండుతుందని, రాయలసీమ జిల్లాలు ఈ పంటకు ఎంతో అనుకూలమని రైతులు వివరించారు. కర్ణాటకలోనూ రోజ్ ఆనియన్ పేరుతో ఉల్లి సాగు జరుగుతోందని, ఆ రాష్ట్రం కేంద్రంతో మాట్లాడి రోజ్ ఆనియన్ రకం ఉల్లి ఎగుమతిపై బ్యాన్ ఎత్తివేయించిందని.. అలాగే ఏపీ రైతుల విషయంలోనూ కేంద్రం బ్యాన్ ఎత్తేసి ఆదుకోవాలని ఉల్లి రైతులు డిమాండ్ చేశారు.

పత్తి రైతుల తరహాలో కేపీ ఉల్లి రైతుల ఆత్మహత్యలు జరిగే ప్రమాదం కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.. ఇప్పటికే రాష్ట్ర నేతలు, అధికారులను కలిసి సమస్య వివరించామని తెలిపారు. కేంద్ర పెద్దలతో కలిసేందుకు ఢిల్లీ వచ్చామని, రైతు ఆదాయం రెట్టింపు చేస్తానంటున్న ప్రధాని మోదీ తమ సమస్య పరిష్కరించాలని కోరారు.