తీరు మారని చింతమనేని.. పోలీసులకు రైతుల ఫిర్యాదు..!

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. చింతమనేనితో పాటు మరో నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రైతులు. పంటపొలాలకు నీటిని తరలించే పైపులను దౌర్జన్యంగా తీసుకెళ్లారని పెదవేగి పీఎస్‌లో వారు ఫిర్యాదు చేశారు. రైతు సత్యనారాయణ ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా నదిలోకి వెళ్తున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంటపొలాలకు సరఫరా చేసేందుకు మూడేళ్ల […]

తీరు మారని చింతమనేని.. పోలీసులకు రైతుల ఫిర్యాదు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 20, 2019 | 6:09 PM

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. చింతమనేనితో పాటు మరో నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రైతులు. పంటపొలాలకు నీటిని తరలించే పైపులను దౌర్జన్యంగా తీసుకెళ్లారని పెదవేగి పీఎస్‌లో వారు ఫిర్యాదు చేశారు. రైతు సత్యనారాయణ ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా నదిలోకి వెళ్తున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంటపొలాలకు సరఫరా చేసేందుకు మూడేళ్ల కిందట పైపులను ఏర్పాటు చేశారు. చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ పైపుల ద్వారా నీటిని మళ్లించి చెరువులను నింపేవారు.

కాగా.. పెదవేగి, దెందులూరు, పెదపాడు మండలాల్లోని కొన్ని గ్రామాలకు నీటిని మళ్లించారు. అయితే.. ప్రస్తుతం ఈ పైపులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని తీసుకెళ్లడం వివాదానికి దారితీసింది. నీటిని పెట్టుకున్నందుకు ఆయనకు ఏటా ఎకరానికి వెయ్యి రూపాయలు ఇచ్చామని, కానీ ఇప్పుడు ఎలా తీసుకెళతారని రైతులు ప్రశ్నించారు. అయినా చింతమనేని తీరు మారకపోయే సరికి రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.