Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లిన రైతు..చేతిలో పెట్రోల్‌ డబ్బా !

Farmer Carries Petrol bottle in Siricilla District, ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లిన రైతు..చేతిలో పెట్రోల్‌ డబ్బా !

పెట్రోల్‌ దాడిలో మృతిచెందిన అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి ఉద్దాంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విజయారెడ్డి ఇన్సిడెంట్‌ తర్వాత చాలా చోట్ల రెవెన్యూ అధికారులు స్వీయ రక్షణా చర్యలు మొదలుపెట్టారు. ఎక్కడ ఏ చిన్నా అనుమానం కలిగినా చాలా సీరియస్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. ఎట్నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి పెట్రోల్‌ డబ్బాతో వచ్చిన రైతు అక్కడి అధికారులను కంగారు పెట్టించాడు. చివరకు అసలు విషయం తెలిసి అవాక్కయారు.
జిల్లాలోని రామన్న పల్లె గ్రామానికి చెందిన పన్యాల చంద్రయ్య అనే రైతు బద్దనపెల్లికి చెందిన నర్సింహరెడ్డి దగ్గర 29 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. దానిని తన భార్య లింగవ్వ పేరుమీద రిజిస్టర్‌ చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయమై ఎమ్మార్వో ఆఫీసులో ఆరా తీసేందుకు వచ్చాడు. అయితే, తమ గ్రామం నుంచి ఎప్పుడు సిరిసిల్ల వచ్చినా..తన మోటార్‌ సైకిల్‌కు కావాల్సిన పెట్రోల్‌ తీసుకు వెళ్లటం చంద్రయ్యకు అలవాటు. ఈ సారి కూడ తన బండ్లోకి కావాల్సిన పెట్రోల్‌ తీసుకుని, వెళ్తూ.. ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చాడు. పట్టా మార్పిడి కోసం సంతకం పెట్టేందుకు తన భార్యను ఎప్పుడు తీసుకురావాలంటూ అడిగేందుకు వచ్చాడట. ఇంతలోకే రైతు చేతిలో ఉన్న పెట్రోల్‌ బాటిల్‌ ను గమనించిన ఆర్‌ఐ, ఇతర సిబ్బంది పరుగు పరుగున వచ్చారు. చేతిలో ఉన్న పెట్రోల్‌ డబ్బా దేనికంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తీరా విషయం తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే చంద్రయ్యకు తగిన సమాచారం అందించి అక్కడి నుంచి పంపించేశారు.