ఆగని అన్నదాతల ఆత్మహత్యలు.. తెలంగాణ @3, ఏపీ @4!

పంట పండించి పది మందికి అన్నం పెట్టే రైతులే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పంట నష్టాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, అప్పులు బాధ.. ఇలా అనేక కారణాల వల్ల అన్నదాతలు ప్రతి ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వ్యవసాయ రంగంపై విడుదల చేసిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. 2018కి సంబంధించిన ఈ నివేదికలో దేశవ్యాప్తంగా సుమారు 10,349 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగాన్నే […]

ఆగని అన్నదాతల ఆత్మహత్యలు.. తెలంగాణ @3, ఏపీ @4!
Follow us

| Edited By:

Updated on: Jan 11, 2020 | 4:51 AM

పంట పండించి పది మందికి అన్నం పెట్టే రైతులే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పంట నష్టాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, అప్పులు బాధ.. ఇలా అనేక కారణాల వల్ల అన్నదాతలు ప్రతి ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వ్యవసాయ రంగంపై విడుదల చేసిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి.

2018కి సంబంధించిన ఈ నివేదికలో దేశవ్యాప్తంగా సుమారు 10,349 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగాన్నే నమ్ముకున్న వీరంటే అప్పుల బాధ తాళలేక.. ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా లేకపోవడం వల్లే ఆత్మహత్యలు చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే 2016తో పోలిస్తే.. ఈ సంఖ్య తగ్గిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా 2016లో 11,379 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇక 2017లో వ్యవసాయ రంగానికి సంబంధించి 10,655 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అందులో 5,955 మంది రైతులు కాగా.. 4,700 రైతు కూలీలు. అటు  రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర(34.7%) అగ్రస్థానంలో ఉండగా.. కర్ణాటక(23.2%), తెలంగాణ(8.8%), ఆంధ్రప్రదేశ్(6.4% ), మధ్యప్రదేశ్(6.3%) రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, మేఘాలయ, గోవా, చంఢీగర్ రాష్ట్రాల్లో మాత్రం రైతు ఆత్మహత్యలు లేకపోవడం విశేషం.

ఈ రైతుల ఆత్మహత్యలు క్షీణిస్తున్న భారతీయ వ్యవసాయ రంగానికి అడ్డం పడుతుంటే.. కేంద్రం మాత్రం ఈ సమస్య గురించి పరిష్కారం వెతక్కుండా.. ఎన్‌ఆర్సీ, సీఏఏ అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తోందని విశ్లేషకుల వాదన.

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..