చనిపోయిన శునకానికి దశదినకర్మలు చేసిన రైతు

ఉత్తరప్రదేశ్ రాష్టంలో ఓ రైతు పెంచుకున్న శునకానికి అంతిమ సంస్కారాలతో పాటు కర్మకాండలు కూడా నిర్వహించారు

చనిపోయిన శునకానికి దశదినకర్మలు చేసిన రైతు
Follow us

|

Updated on: Oct 17, 2020 | 12:37 PM

ఇవాళ రేపు చనిపోతే రక్తసంబంధీకులే దూరమవుతున్నారు. కనీసం చనిపోయినవారికి కర్మకాండలు చేసేందుకు సైతం గాలికొదిలేస్తున్నారు. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్టంలో ఓ రైతు పెంచుకున్న శునకానికి అంతిమ సంస్కారాలతో పాటు కర్మకాండలు కూడా నిర్వహించారు. యూపీలోని మీరట్ జిల్లాలోని బాధం గ్రామంలో ఉదంతం చోటుచేసుకుంది. ఒక రైతు తాను పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘పుష్ప’ మృతి చెందింది. రైతు యోగేష్ తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క మృతి చెందడంతో దానికి హిందూ సాంప్రదాయం ప్రకారం బాజా బజంత్రీల మధ్య అంత్యక్రియలు నిర్వహించాడు. ఇదే నేపధ్యంలో 13వ రోజున గ్రామస్తులందరికీ భారీ అన్న సంతర్ఫణ కార్యక్రమం నిర్వహించాడు. దీనికి ముందు ఆ రైతు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక కార్డులను ముద్రించి గ్రామస్తులందరికీ పంచాడు.

‘పుష్ప’ను యోగేష్ ఆరేళ్ల పాటు పెంచిపోషించాడు. అది మృతి చెందినపుడు ఇంటిలోని సభ్యుడే మరణించిన రీతిగా యోగేష్ కుమిలిపోయాడు. గ్రామస్తులంతా వెంటరాగా యోగేష్ ఆ శునకానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ శునకం మరణించిన తరువాత 13వ రోజున శాంతి హోమాన్ని నిర్వహించాడు. 13 మంది బ్రాహ్మణులకు దక్షిణాది తాంబూలాలు సమర్పించి ఘనంగా సత్కరించాడు. తరువాత ‘పుష్ఫ’ అస్థికలను పుణ్య నదిలో కలిపాడు. గ్రామస్తులందరికీ అన్నదానం చేసి పుష్పపై తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?