రెండు తలలతో ఈ పాము ఎలా పరిగెడుతుందో మీరే చూడండి..!

రెండు తలలు పాముల గురించి ఎన్నో రూమర్స్ ప్రతిరోజూ హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. అయితే అవి ముందు ఒక తల, వెనుక తల ఉండేవి. అవి రెగ్యులర్‌గా మన పల్లెటూర్లలో కనిపిస్తూనే ఉంటాయి.  కానీ ఒకవైపే రెండు తలలు ఉన్న పాములను మీరు ఎప్పుడైనా చూశారా..?. ఇప్పుడు మీకు అటువంటి పామునే పరిచయం చేయబోతున్నాం.  చైనాలో షెన్‌జౌ ప్రాంతానికి చెందిన రైతు తన పొలంలో రెండు తలల పామును చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఓ కుండలో ఆ […]

రెండు తలలతో ఈ పాము ఎలా పరిగెడుతుందో మీరే చూడండి..!
Follow us

|

Updated on: Oct 24, 2019 | 10:07 PM

రెండు తలలు పాముల గురించి ఎన్నో రూమర్స్ ప్రతిరోజూ హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. అయితే అవి ముందు ఒక తల, వెనుక తల ఉండేవి. అవి రెగ్యులర్‌గా మన పల్లెటూర్లలో కనిపిస్తూనే ఉంటాయి.  కానీ ఒకవైపే రెండు తలలు ఉన్న పాములను మీరు ఎప్పుడైనా చూశారా..?. ఇప్పుడు మీకు అటువంటి పామునే పరిచయం చేయబోతున్నాం.  చైనాలో షెన్‌జౌ ప్రాంతానికి చెందిన రైతు తన పొలంలో రెండు తలల పామును చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఓ కుండలో ఆ పామును బంధించాడు.  అనంతరం దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది  వైరల్ అయ్యింది.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ పామును చూసేందుకు షెన్‌జౌ పొలంలో క్యూ కట్టారు. అందరికి చూపించిన తర్వాత షెన్‌జౌ దాన్ని మళ్లీ కుండలో పెట్టేశాడు. అయితే, ఓ పిల్లాడు పొరపాటున కుండను పడేయడంతో పాము అక్కడి నుంచి తప్పించుకుంది. ఆ పాము సైజులో చాలా చిన్నదిగా ఉండటంతో ఎవరికీ కనిపించలేదు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.