ఫరీదాబాద్ మర్డర్ కేసులో ఏది నిజం ? ఏది అబధ్ధం ?

హర్యానాలోని ఫరీదాబాద్ లో నిఖిత తోమర్ అనే యువతిని తౌసీఫ్  పట్టపగలు కాల్చి చంపిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.  2018 లోనే నిఖితను తౌసీఫ్ కిడ్నాప్ చేశాడని, పెళ్లి చేసుకోమని అతగాడు ఆమెను బలవంతం చేసేవాడని తెలిసింది. అప్పట్లోనే అతనిపై తాము  పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు ఎఫ్ ఐ ఆర్  దాఖలు చేసి అతడిని అరెస్టు చేశారని ఆమె కుటుంబం చెబుతోంది. అయితే హర్యానా మంత్రి అనిల్ విజ్ కథనం మరోలా ఉంది. తమ […]

  • Umakanth Rao
  • Publish Date - 3:13 pm, Tue, 27 October 20

హర్యానాలోని ఫరీదాబాద్ లో నిఖిత తోమర్ అనే యువతిని తౌసీఫ్  పట్టపగలు కాల్చి చంపిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.  2018 లోనే నిఖితను తౌసీఫ్ కిడ్నాప్ చేశాడని, పెళ్లి చేసుకోమని అతగాడు ఆమెను బలవంతం చేసేవాడని తెలిసింది. అప్పట్లోనే అతనిపై తాము  పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు ఎఫ్ ఐ ఆర్  దాఖలు చేసి అతడిని అరెస్టు చేశారని ఆమె కుటుంబం చెబుతోంది. అయితే హర్యానా మంత్రి అనిల్ విజ్ కథనం మరోలా ఉంది. తమ కూతురును నిందితుడు కిడ్నాప్ చేయలేదని నిఖిత తండ్రి తెలిపారని ఆయన అంటున్నారు. ఇంతేకాదు.. ఆ  ఏడాదిలోనే తౌసీఫ్ పై కేసు పెట్టేందుకు కూడా వారు నిరాకరించారని ఆయన తెలిపారు. మరోవైపు పోలీసులు..2018 లో తౌసీఫ్ పై కేసు దాఖలైన విషయం నిజమేనని అంటున్నారు. ఇదిలా ఉండగా ..నిఖిత చదువుతున్న కళాశాల వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.