సోనూసూద్ ఉదారత.. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా 10 బస్సులు

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇదివరకే కరోనా నేపథ్యంలో పంజాబ్‌లోని వైద్యులకు 1500 వ్యక్తిగత సంరక్షణ కిట్లను అందించాడు. అలాగే జుహూలోని తన హోటల్స్‌ని వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు..

సోనూసూద్ ఉదారత.. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా 10 బస్సులు
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 5:21 PM

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇదివరకే కరోనా నేపథ్యంలో పంజాబ్‌లోని వైద్యులకు 1500 వ్యక్తిగత సంరక్షణ కిట్లను అందించాడు. అలాగే జుహూలోని తన హోటల్స్‌ని వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు వసతికి ఉపయోగించేందుకు ముందుకొచ్చాడు. కాగా ఇప్పుడు మరోసారి.. వలస కార్మికులని స్వస్థలాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా పది బస్సులు ఏర్పాటు చేశాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక చిక్కుకున్న వసల కార్మికులను.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని రవాణా సౌకర్యం కల్పించాడు. సోమవారం ఈ బస్సులు థానే, గుల్బర్గా నుంచి బయలు దేరాయి. ఈ సందదర్భంగా సోనూసూద్ బస్టాపుల వద్దకు వెళ్లి.. వలస కార్మికులకు గుడ్‌బై చెప్పాడు.

ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఒకే సమస్యతో బాధపడుతున్న ఈ తరుణంలో ప్రతీ భారతీయుడు తన కుటుంబంతో, ఇష్టమైన వారితో కలిసి ఉంటేనే పోరాడగలదనేది నా నమ్మకం. అందుకే ఇలా రోడ్లపై ఇబ్బంది పడుతున్న కార్మికుల్ని వారి స్వస్థలాలకు తరలించేందుకు నేను మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడాను. ఇందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించాయి. 10 బస్సుల్లో వారు ప్రయాణిస్తున్నారు. పిల్లలు, వృద్ధులతో కూడిన వలస కార్మికుల్ని రోడ్లపై చూసి నా హృదయం ద్రవించింది. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు.. మిగిలిన రాష్ట్రాల్లోనూ వలస కార్మికులకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు సోనూ. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతోంది.

Read More:

బ్రేకింగ్ న్యూస్: ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్‌ లెసన్స్

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వావ్ వాటే టెక్నాలజీ.. వాట్సాప్‌లో ఒకేసారి 50 మందితో వీడియో కాల్!

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..