Breaking News
  • హైదరాబాద్‌: ఈనెల 19న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వెంట ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్‌ ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. వాయుగుండం ఇప్పటికే అరేబియా సముద్రంలో కలిసిపోయిందని, భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది.
  • అమరావతి: స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ పై కీలక సర్కులర్ జారీ. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదు అని ఆదేశం . కొన్ని స్కూల్స్ లో విద్యార్థుల కుల, మత వివరాలు హాజరు లో నమోదు చేస్తున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే వాటిని తొలగించాలని సర్కులర్ జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్.
  • కూకట్ పల్లిలో దారుణం, స్నేహం ముసుగులో అత్యాచారం. జూబ్లీహిల్స్ కి చెందిన బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం. బర్త్ డే కేకు లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం . విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరింపులు. తీవ్ర అస్వస్తతకి లోనవడంతో ఆస్పత్రిలో చేర్చిన తల్లిదండ్రులు. నిలదీయడంతో విషయం బయటపెట్టిన బాలిక. జోసెఫ్, రాము, నవీన్ ల పై కేసు నమోదు చేసిన తల్లిదండ్రులు.
  • గుంటూరు: జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న విజయవాడ తేజస్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు. కత్తితో పొడుచుకోవడంతో పొట్టలో తీవ్ర గాయం. పేగులలో బ్లీడింగ్ కావడంతో ఆపరేషన్ చేసిన జిజిహెచ్ వైద్యలు. నాగేంద్రబాబు ను ఐసియులో పెట్టి చికిత్స అందిస్తున్న వైద్యులు. ఇంకా స్పృహలోకి రాని నాగేంద్రబాబు. రెండు రోజులు గడిస్తే గాని నాగేంద్రబాబు పరిస్థితి చెప్పలేమంటున్న వైద్యులు.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. వర్చువల్‌ విధానం ద్వారా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లైఓవర్ ను లాంఛనంగా ప్రారంభించారు
  • ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు హైదరాబాద్‌:- ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్‌ కు 19.33 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
  • ఖమ్మం అత్యాచారం దాడి కేసులో బాలిక మృతి.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పదమూడేళ్ల బాలిక మృతి.. గత నెలలో బాలికపై అత్యాచారం చేసి దాడి చేసిన యువకుడు .. గాయాలపాలైన 13 ఏళ్ల బాలిక కు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స.. బాలిక పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ పదమూడేళ్ల బాలిక మృతి

శింబు-త్రిష పెళ్లి, తమిళనాట వార్తలు చక్కర్లు !

తమిళనాట శింబు, త్రిషల పెళ్లి హడావిడి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 'విన్నైతండి వరువాయ' (తెలుగులో 'ఏమాయ చేశావే') సినిమాలో కలిసి నటించి ప్రేక్షకుల అలరించారు హీరోహీరోయిన్లు శింబు, త్రిష.

Trisha Krishnan and Simbu's marriage rumours, శింబు-త్రిష పెళ్లి, తమిళనాట వార్తలు చక్కర్లు !

తమిళనాట శింబు, త్రిషల పెళ్లి హడావిడి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘విన్నైతండి వరువాయ’ (తెలుగులో ‘ఏమాయ చేశావే’) సినిమాలో కలిసి నటించి ప్రేక్షకుల అలరించారు హీరోహీరోయిన్లు శింబు, త్రిష. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అసలు వీరిద్దరూ నిజమైన ప్రేమికులా అన్నంతగా ఆ పాత్రల్లో నటించారు. వీరు దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్నారంటూ గతంలో చాలాసార్లు వార్తలు సర్కులేట్ అయ్యాయి.  తాము మంచి స్నేహితులమే అని ఈ జంట ఆ వార్తలను తోసిపుచ్చింది.  కాగా, లాక్‌డౌన్‌ సమయంలో త్రిష-శింబు కలిసి ‘కార్తీక్‌ డయల్‌ సేతా యెన్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ కోసం పనిచేశారు. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో ఓ శుభవార్త చెబుతానంటూ శింబు ఇటీవల అనౌన్స్ చేశారు. దీంతో త్రిష-శింబు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ అతి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మామూలుగా అయితే ఇలాంటి వదంతులు వచ్చినప్పుడు అవి ఫేక్ అయితే హీరో లేదా హీరోయిన్ ఎవరో ఒకరు వాటిని ఖండిస్తారు. కానీ ఇప్పటివరకు శింబు, త్రిషల విషయంలో అది జరగలేదు. దీంతో జనాల్లో అనుమానాలు బలపడ్డాయి.  ( చీరమేను సీజన్ వచ్చేసిందోచ్..! )

ఇక తాజాగా శింబు తండ్రి టి.రాజేందర్ సైతం ఈ ప్రచారం మీద స్పందించడానికి ఇష్టపడలేదు.   తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో ఈ ఏడాది శింబు తండ్రి రాజేందర్‌‌‌ పోటీ చేయనున్నట్లు ప్రకటించడానికి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఓ విలేకరి‌.. శింబు-త్రిష పెళ్లి‌ గురించి స్పందించమని కోరగా.. ఆయన‌ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నను దాటవేశారు. దీంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది.

( దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై ! )

( ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు ! )

 

 

Related Tags