భారత రత్న ఇవ్వాల్సిందే.. పెరుగుతున్న డిమాండ్

'అమ్మ బోమ్మాలీ..' అంటే చాలు గుర్తుకోచ్చేది సోనూ సూద్.. ఈ పేరు చెప్పగానే తెలుగులో అతడు నటించిన విలన్ పాత్రలు గుర్తొస్తాయి. తెరపై అత్యంత కర్కసంగా, క్రూరంగా కనిపించే సోనూ సూద్..

భారత రత్న ఇవ్వాల్సిందే.. పెరుగుతున్న డిమాండ్
Follow us

|

Updated on: Jun 30, 2020 | 11:02 AM

బాలీవుడ్ హీరో ఒకరు… రియల్ లైఫ్ హీరో మరొకరు.. ఈ ఇద్దరిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో ముంబైలో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులను సురక్షితంగా స్వంత రాష్ట్రాలకు తరలించిన వ్యక్తి ఒకరైతే .. కోట్ల రూపాయలను ప్రభుత్వానికి అందించిన వ్యక్తి మరొకరు. ఈ ఇద్దరికి  దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇందులో ఒకరు వలస కార్మికుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్… లాక్ డౌన్ సమయంలో రూ.25 కోట్లను ప్రభుత్వానికి విరాళంగా అందజేసిన అక్షయ్ కుమార్ మరొకరు. సోషల్ మీడియాలో అభినందిచడమే కాదు.. ప్రభుత్వానికి (భారత రత్న) విన్నపాలను పంపిస్తున్నారు.

కొనసాగుతున్న దాత‌ృత్వాం..

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించి దాదాపు నెలరోజులు పూర్తి కావస్తున్నా…, ఈ రోజుకీ సాయం చేయమని వందల కాల్స్‌ వస్తున్నాయని సోనూసూద్ తెలిపారు. అలాంటి వారందరికీ కాదనకుండా సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. గతవారం కూడా ఉత్తరాఖండ్‌ వెళ్లేందుకు 2వేల మందికి, బిహార్‌ చేరేందుకు 2,400మందికి సాయం చేసినట్లు పేర్కొన్నారు.

సురక్షితంగా స్వగ్రామాలకు చేరుకున్న వలస కార్మికులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సోనూసూద్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తమ అభిమాన హీరోను అభినందించడమే కాకుండా ప్రభుత్వానికి అభ్యర్థనలు పంపుతున్నారు.

తెలుగువారికి ‘అమ్మ బోమ్మాలీ..’ 

‘అమ్మ బోమ్మాలీ..’ అంటే చాలు గుర్తుకోచ్చేది సోనూ సూద్.. ఈ పేరు చెప్పగానే తెలుగులో అతడు నటించిన విలన్ పాత్రలు గుర్తొస్తాయి. తెరపై అత్యంత కర్కసంగా, క్రూరంగా కనిపించే సోనూ సూద్.. నిజజీవితంలో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు.