‘ఆర్ఆర్ఆర్’పై ‘సాహో’ ఎఫెక్ట్.?

ప్రభాస్ ‘సాహో’ మూవీ వాయిదా పడడం ఫ్యాన్స్‌ని తెగ డిసప్పాయింట్ చేసింది. కానీ రెండు వారాలు మాత్రమే కావడంతో ఆ ఎఫెక్ట్ ఎక్కువగా లేదు. ముందుగా ‘సాహో’ను అనుకున్న టైంకు రిలీజ్ చేస్తామని టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది. కానీ టైంకు చేతులెత్తేసింది. పెద్ద సినిమా రిలీజ్ విషయంలో అందుకే తొందరపడకూడదు. ఎందుకంటే అనౌన్స్ చేసిన డేట్‌కు ఫ్యాన్స్ ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి. అయితే ‘సాహో’ రిలీజ్ డేట్ మారడంతో ఇప్పుడు అందరి చూపు త్రిబుల్ ‘ఆర్’ పైన ఉంది. త్రిబుల్ ‘ఆర్’ కూడా భారీ బడ్జెట్ మూవీ అంతేకాదు చారిత్రాత్మక సినిమా. ఇలాంటి సినిమాను చాలా కేర్ ఫుల్‌గా తీయాలి. ఎంతైనా ఈ సినిమా జక్కన్న చెక్కుతున్నాడు కాబట్టి అదంతా జక్కన్న చూసుకుంటాడు. కానీ చెప్పిన టైంకు రిలీజ్ చేస్తాడా లేదా అన్న డౌట్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో స్టార్ట్ అయింది. ఇప్పటికే త్రిబుల్ ‘ఆర్’ షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇంకా చారిత్రాత్మక సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీనితో షూటింగ్ కూడా చాలా ముందుగా కావాలి. కానీ త్రిబుల్ ‘ఆర్’ షూటింగ్ పనులు అంత శరవేగంగా జరుగుతున్నట్లు కనిపించడం లేదు. చూడాలి మరి జక్కన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడో.? లేదో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *