అంబరీష్ కొడుకు సినిమా గురూ! టికెట్ లక్ష

Fan Buys Ticket Worth Rs 1 Lakh for Debut Film of Late Ambareesh's Son, అంబరీష్ కొడుకు సినిమా గురూ! టికెట్ లక్ష

తమ అభిమానుల నటులు సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా ఉత్తరాదిన కంటే దక్షిణాదిన హీరోలను ఫ్యాన్స్  ఓ దేవుడిలా కొలిచే సంప్రదాయం ఎక్కువగా ఉంది. తాజాగా ఇలాంటి సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దివంగత నటుడు అంబరీశ్ కుమారుడు అభిషేక్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘అమర్’ ఈ రోజే విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై కర్ణాటక సినీ ప్రియుల్లో ఎంతో క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంతో దావణగిరె ప్రాంతానికి చెదిన మంజునాథ్ అనే వ్యక్తి తన కుమారుడికి అదిరిపోయే బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఇందుకోసం అంబరీశ్ కొడుకు అభిషేక్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘అమర్ ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం రూ. లక్ష రూపాయలతో టికెట్ కొనుగోలు చేసాడు.

ఇక సదురు అంబరీశ్ అభిమాని సందేశ్ ప్రొడక్షన్స్ పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈ సంస్థ పేరు మీద మంజునాథ్ ఈ టికెట్లు కొనుగోలు చేసినట్టు సమాచారం. అంబరీశ్ కొడుకు అభిషేక్ నటించిన ‘అమర్’ చిత్ర విషయానికొస్తే..ఈసినిమాను నాగ శేఖర్ దర్శకత్వం వహించారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో దివంగత అంబరీశ్ అతిథి పాత్రలో నటించారు. తన కుమారుడి తొలి సినిమా చూడకుండానే అంబరీశ్ కన్నుమూసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *