ప్రముఖ కవి దేవిప్రియ కన్నుమూత, తెలుగు సాహితీ ప్రముఖులు దిగ్భ్రాంతి

ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత దేవిప్రియ శనివారం ఉదయం కన్నుమూశారు.  నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న..

  • Ram Naramaneni
  • Publish Date - 11:42 am, Sat, 21 November 20

ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత దేవిప్రియ శనివారం ఉదయం కన్నుమూశారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం 7.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి నుంచి ఆయన భౌతికఖాయాన్ని అల్వాల్‌లోని స్వగృహానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం తిరుమలగిరి స్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల తెలుగు సాహితీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  పలువురు సాహితీప్రముఖులు సంతాపం ప్రకటించి, నివాళులు అర్పించారు. తెలుగు రచనలపై అవగాహన ఉన్నవారికి దేవిప్రియను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.  ఐదు దశాబ్దాల పాటు ప్రముఖ పాత్రికేయుడిగా, కవిగా దేవిప్రియ సేవలందించారు.

కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న దేవిప్రియ నవంబరు 6న ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆయన ఎడమ కాలికి ఇన్‌ఫెక్షన్‌ అవ్వడంతో తొమ్మిదో తేదీన ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశారు. ఆరోగ్యం నిలకడగా మారి  క్రమక్రమంగా కోలకుంటున్న సమయంలో బ్లెడ్‌లో ఇన్‌ఫెక్షన్ మొదలైంది. దీంతో‌ ఇతర ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టాయిి. అవి తీవ్రమై ఈరోజు ఉదయం మరణించారు.  దేవిప్రియ అసలు పేరు షేక్‌ ఖాజా హుస్సేన్‌.  గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. పలు పత్రికల్లో ఆయన కలం నుంచి జాలువారిన కార్టూన్‌ కవితలు ‘రన్నింగ్‌ కామెంట్రీ’ పాఠకలోకం మన్ననలు అందుకున్నాయి.

‘అమ్మచెట్టు’,  ‘తుఫాను తుమ్మెద’, ‘నీటిపుట్ట’, ‘చేప చిలుక’, ‘సమాజానంద స్వామి’, ‘గాలిరంగు’, ‘గరీబు గీతాలు’, ‘గంధకుటి’ తదితర కవితా సంపుటిలతో పాటు పలు రేడియో, రంగస్థల నాటికలు, సినిమా పాటలు రచించారు. ‘గాలిరంగు’ కవితా సంకలనానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది.

Also Read :

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం

ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్