టాలీవుడ్ లో ఊహించ‌ని విషాదం..మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ కన్నుమూత

టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ఖ్యాత‌ మిమిక్రీ కళాకారుడు నటుడు హరి కిషన్ ప్రాణాలు విడిచారు. 57 ఏళ్ల హ‌రికిష‌న్.. గత కొన్ని రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. టాలీవుడ్ లో సీనియ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌రేష‌న్ నుంచి చిరంజీవి జ‌న‌రేష‌న్..ప్ర‌స్తుత యూత్ హీరోలైన జూనియ‌ర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వరకు అందరి ఇమిటేట్ చెయ్య‌గ‌ల మిమిక్రీ క‌ళాకారుడు హరి కిష‌న్. ఓన్లీ హీరోలు మాత్ర‌మే కాదు తెలుగు రాష్ట్రాల్లో మాజీ, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రులు.. ఎన్టీఆర్, వైయస్ఆర్, […]

టాలీవుడ్ లో ఊహించ‌ని విషాదం..మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ కన్నుమూత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 23, 2020 | 3:43 PM

టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ఖ్యాత‌ మిమిక్రీ కళాకారుడు నటుడు హరి కిషన్ ప్రాణాలు విడిచారు. 57 ఏళ్ల హ‌రికిష‌న్.. గత కొన్ని రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. టాలీవుడ్ లో సీనియ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌రేష‌న్ నుంచి చిరంజీవి జ‌న‌రేష‌న్..ప్ర‌స్తుత యూత్ హీరోలైన జూనియ‌ర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వరకు అందరి ఇమిటేట్ చెయ్య‌గ‌ల మిమిక్రీ క‌ళాకారుడు హరి కిష‌న్. ఓన్లీ హీరోలు మాత్ర‌మే కాదు తెలుగు రాష్ట్రాల్లో మాజీ, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రులు.. ఎన్టీఆర్, వైయస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్, జ‌గ‌న్ ల‌‌ గొంతులను కూడా అచ్చుగుద్దిన‌ట్టు మిమిక్రీ చేయ‌గ‌ల‌రు ఈయ‌న‌. మిమిక్రీతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన చాలామంది న‌టులు ఆయ‌న శిష్యులే.

కాగా హరికిషన్.. మే 30, 1963 తేదీన శ్రీమతి రంగమణి, వి.ఎల్.ఎన్ చార్యులు దంపతులకు ఏలూరులో జన్మించారు. చిన్న‌ప్ప‌టి నుంచే.. తన స్నేహితుల‌, గురువుల గొంతులను మిమిక్రీ చేయడం ప్రారంభించారు హరికిషన్. అలా ప్రారంభమైన హరికిషన్ మిమిక్రీ కెరీర్… ఆ తర్వాత దేశ‌విదేశాల్లో వంద‌ల కొద్దీ స్టేజ్ షోలు ఇచ్చేవర‌కు వెళ్లింది. పశు పక్ష్యాదుల శబ్ధాలతో పాటు సంగీత వాద్య ప‌రికరాలు, యంత్రాలు చేసే శబ్ధాలు.. తన గొంతులో పలకించడం హరి కిషన్ స్పెషాలిటీ. హరికిష‌న్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!